కాంత లో ప్రధాన హైలెట్స్ ఇవే అంటున్న ప్రేక్షకులు
on Nov 14, 2025

-కాంత పబ్లిక్ టాక్ ఏంటి?
-అభిమానులని, ప్రేక్షకులని మెప్పించిందా!
-దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ నటనకి ప్రశంసలు
-ఫస్ట్ డే ఎంత వసూలు చేస్తుంది
కాంబినేషన్స్ పరంగానే కాకుండా ప్రచార చిత్రాలతో పాన్ ఇండియా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని పొందిన మూవీ 'కాంత'(Kaantha).రిలీజ్ డేట్ ఈ రోజైనా నిన్నటి నుంచే ప్రీమియర్స్ ప్రదర్శించడంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో నైట్ నుంచే సినిమాకి సంబంధించిన టాక్ బయటకి వచ్చింది. ఎక్కువ మంది సినిమా బాగుందని చెప్తుండటంతో పాటు సినిమాలోని మెయిన్ హైలెట్స్ గురించి కూడా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు. వాళ్ళు చెప్తున్న మెయిన్ హైలెట్స్ ఏంటో చూద్దాం.
మహదేవన్,కుమారి పెర్ఫార్మెన్సు తో పాటు ఆ ఇద్దరి మధ్య వచ్చిన ప్రేమ సన్నివేశాలు ఎంతో హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. అయ్యా, మహదేవన్ మధ్య సీన్స్ చూస్తుంటే ఇగో, అహంకారం, స్వార్ధం అనేవి ఒక మనిషిని ఎంతటి ప్రమాదకర స్థితికి తీసుకెళ్తాయో చెప్పినట్లయింది. ముఖ్యంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడి చేతిలోనే నవ్వుతు కుమారి మరణించిన సన్నివేశం కంటతడి తెప్పించింది. కుమారి ని ఎవరు చంపారనే సస్పెన్సు తో పాటు, తానే చంపానని మహదేవన్ చెప్పే సీన్ అయితే సూపర్. ఆ విధంగా ఎందుకు చంపానో అని మహదేవన్ కారణం చెప్పడం, కానీ కుమారి ఎంతో మంచిదని అనవసరంగా తానే అపార్ధం చేసుకున్నానని తెలిసి, మహదేవన్ త నలో తానే కుమిలిపోవడం లాంటి సన్నివేశాలు ప్రధాన హైలెట్ గా నిలిచాయి.
ఇగో తో తాను చేసిన పొరపాటుకి పశ్చత్తాపపడి తనంతట తానుగా రివాల్వర్ తో కాల్చుకొని చనిపోవడం మరో హైలెట్. ఫీనిక్స్ క్యారక్టర్ కి సంబంధించిన టైమింగ్ చాలా బాగుంది. ఫొటోగ్రఫీ మన కళ్ళ ముందు జరుగుతున్న కథలా కాంత ని మలిచింది. దర్శకత్వం కూడా ఎక్స్ లెంట్. నటినటుల పెర్ ఫార్మెన్స్ కూడా మెస్మరైజ్ చేస్తుందని మూవీ చూసిన మెజార్టీ ప్రేక్షకులు చెప్తున్నారు.
also read: కాంత మూవీ రివ్యూ
మహదేవన్ అనే హీరో క్యారక్టర్ లో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)కనిపించగా, కుమారి అనే హీరోయిన్ పాత్రలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse)కనిపించింది. దర్శకుడు అయ్యగా సముద్రఖని,పోలీస్ ఆఫీసర్ ఫీనిక్స్ క్యారక్టర్ ని రానా పోషించడం జరిగింది. సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj)దర్శకుడిగా వ్యవహరించగా రానా, దుల్కర్, ప్రశాంత్ పొట్లూరి నిర్మాతలు. డాని సాంచెజ్ లోపెజ్ ఛాయాగ్రాహకుడు. మరి కలెక్షన్స్ పరంగా ఎన్ని రికార్డులు అందుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



