జ్యోతిక రీఎంట్రీ మూవీ ఫస్ట్ లుక్
on Mar 9, 2015

మలయాళంలో సూపర్ హిట్టయ్యిన ‘How Old Are You’ చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలో ‘36వయదినిలే’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో ఈ చిత్రం ద్వారా హీరోయిన్ మంజు వారియర్ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో రీమేక్ అవుతున్న ఈ ‘36వయదినిలే’ చిత్రంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తోంది.దాదాపు చాలా కాలం తర్వాత జ్యోతిక మళ్లీ ఇలాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషమనే చెప్పుకోవాలి. ఒకే సినిమాతో ఇద్దరు హీరోయిన్లు రీఎంట్రీ ఇవ్వడం చాలా అరుదు. అయితే ఈ చిత్రాన్ని తమిళంలో సూర్య తన సొంత బ్యానరైన ‘2D Entertainment’లో నిర్మిస్తున్నాడు. రోషన్ అండ్రెవ్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మహిళా దినోత్సవం సంధర్భంగా ‘36వయదినిలే’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో జ్యోతిక చాలా హోమ్లీ లుక్ తో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



