యాక్షన్‌లోకి దిగిన ఎన్టీఆర్!!
on Feb 21, 2019

ఇటీవల ఎన్టీఆర్ తన ఫ్యామెలీతో కలిసి దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఏదో సరదా ట్రిప్ కోసం కాకుండా అక్కడ జిమ్ ట్రైనర్ వద్ద ప్రత్యేక శిక్షణ తో పాటు స్పెషల్ మేకోవర్ చేయించుకున్నాడట. ఇక అక్కడి నుంచి తిరిగి ఇండియాకు రెండు రోజుల క్రితమే వచ్చాడు. ఇక వచ్చిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా `ఆర్ ఆర్ ఆర్ ` సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఎన్టీఆర్ దుబాయ్ లో ఉన్న అన్ని రోజులు రామ్ చరణ్ తో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ చిత్రీకరించాడు దర్శకుడు రాజమౌళి. ఇక ఈ రోజు (గురువారం) నుంచి షూటింగ్ లో ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరిపైన మెయిన్ సీన్స్ షూట్ చేయడానికి ప్లాన్ చేశాడు దర్శకుడు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఇంత వరకు హీరోయిన్స్ ఎవరనేది మాత్రం ప్రకటించలేదు. త్వరలో మిగతా పూర్తి నటీనటుల పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డివివి దానయ్య సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా రానుందీ చిత్రం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



