మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది..కోర్టు తీర్పుపై జానీ మాస్టర్ వివరణ
on Jan 29, 2025

ప్రముఖ నటి ఝాన్సీ(Jhansi)లేటెస్ట్ గా తన ట్విటర్ వేదికగా ట్వీట్ చేస్తు 'ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలను సవాలు చేస్తూ కోర్టులో కొరియోగ్రాఫర్ జానీ బాషా కేసు వేసాడు.ఇప్పుడు ఆ కేసుపై ఫిల్మ్ ఛాంబర్ గెలిచింది. ఆయన వేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.ఇది ఒక గొప్ప తీర్పు.పని చేసే చోట మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉందని,POSHమార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు మద్దతు ఇచ్చేలా ఫెడరేషన్ కఠినంగా వ్యవహరించి, న్యాయపరంగా పోరాడేలా చేసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ వేసింది.
ఇప్పుడు ఈ పోస్ట్ పై జానీ మాస్టర్ ట్వీట్ చెయ్యడం జరిగింది.నాకు తెలియకుండా ముందస్తుగా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి సంబంధించిన విషయంలో నేను కేసు పెట్టడం జరిగింది.ఆ కేసులో రీసెంట్ గా వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా,నచ్చినట్టుగా మార్చుకొని,మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు.తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది.మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో,అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారో అందరికీ అర్థమవుతుంది.ఆ రోజు కూడా ఎంతో దూరం లేదు.న్యాయమే గెలుస్తుందంటు ట్వీట్ చెయ్యడం జరిగింది.
ఇక లైంగిక ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master)ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న విషయం తెలిసిందే.బయటకి వచ్చిన వెంటనే పలు సందర్భాల్లో ఆయన మాట్లాడుతు నేను ఎలాంటి తప్పు చెయ్యలేదని,కోర్టులో అదంతా ప్రూఫ్ చేసుకుంటాననే ధీమాని వ్యక్తం చేస్తు వస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



