"గ్యారేజ్"పై ఎన్టీఆర్ ఫ్యామిలీ ఏమన్నారంటే..
on Sep 1, 2016
కొరటాల శివ, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కాంభినేషన్లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు వరుస విజయాలతో ఉన్న హీరో, దర్శకుడు కలిసి చేసిన సినిమా కావడంతో జనతా గ్యారేజ్‌పై భారీ అంచనాలున్నాయి. ఇవాళ సినిమా రిలీజ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ధియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అటు సినిమా విడుదలకు ఒక రోజు ముందే..ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో స్పెషల్ షోని చూశారు. సినిమా చూసి బయటకొచ్చిన అనంతరం ఎన్టీఆర్ తల్లి షాలిని..భార్య ప్రణతి అతని నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా చాలా బాగుందని అబ్బాయి చాలా బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చారట. ఇటు ఎన్టీఆర్ భార్య ప్రణతి కూడా తన భర్త నటన అద్భుతంగా ఉందని చెప్పినట్టు తెలిసింది. ముఖ్యంగా డాన్స్‌లు అదిరిపోయినట్టు ప్రణతి చెప్పారు.