అది ‘జై లవకుశ’కథేనా?
on Jul 31, 2017
నిర్మాణంలో ఉన్నప్పుడే సినిమాకు సంబంధించిన సమాచారం లీక్ అవ్వడం ఈ మధ్య కామన్ అయిపోయింది. ఓ విధంగా ‘అత్తారింటికి దారేది’ నుంచి ఈ లీకుల వ్యవహారం మొదలైందని చెప్పాలి. మొన్నటి ‘బాహుబలి’ విషయంలో కూడా యుద్ధ సన్నివేశాలు లీకైన విషయం తెలిసిందే. ఇప్పుడు వంతు ‘జై లవకుశ’సినిమాది. ఈ సినిమాను ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ... ‘జై లవకుశ’ విసయంలో ఓ లీకుల పర్వమే నడుస్తోందని చెప్పాలి.
తొలుత ఈ సినిమా టీజర్ లీక్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమాలోని ‘జై’ నేపథ్యంలో సాగే.. ‘రావణా.. రావణా’ పాటను లీక్ చేశారు. ఇప్పుడు ‘జై లవకుశ’స్టోరీ కూడా లీకై నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కథే అంటూ... ఓ కథ ఫిలిం నగర్ లో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.
అదే నిజమైతే... నిజంగా బాధాకరమే.
‘జై లవకుశ’లో ఎన్టీయార్ త్రిపాత్రాభినయం చేస్తున్న విషయంలో తెలిసిందే. ఇందులో ‘జై’ది ప్రతినాయకుడి తరహా పాత్ర. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆ విషయాన్ని ధృవపరిచింది. ఇక స్టోరీ విషయానికొస్తే... జై, లవ, కుశ.. ఒకే తండ్రి బిడ్డలు. తల్లులు మాత్రం వేరు. వీరిలో పెద్దవాడైన ‘జై’ తొలి భార్య సంతానం కాగా, లవకుశలు రెండో భార్యకు పుట్టిన కవలలు. జై తల్లి అనుకోకుండా చనిపోతుంది. ఆ చావుకు తన తండ్రే కారణం అనుకుంటాడు జై. దాంతో తండ్రి కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంటాడు. ఇంట్లోంచి పారిపోయి సంఘ విద్రోహ శక్తిగా ఎదుగుతాడు. ఇక జైకీ లవకుశలకు మధ్య జరిగిన పోరాటమే మిగిలిన కథ. కథ విటుంటే... నమ్మేట్టుగా ఉంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఆగాల్సిందే.
ఇంతకీ ఈ లీకులు చేస్తున్నదెవరు? అనేది మాత్రం ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. అసలు ఇందులో దర్శక, నిర్మాతల హ్యాండ్ ఉందనీ... సినిమాపై హైప్ పెంచడానికి కావాలనే లీకులు చేస్తున్నారనీ ఓ వాదన ప్రచారం కూడా ఉంది. అప్పుడు ‘అత్తారింటికి దారేది’సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం లీక్ అయినప్పుడు కూడా ఇదే వాదన వినిపించింది. ఏది ఏమైనా...
ఇలా లీకైన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్లు అయ్యాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే... ‘జై లవకుశ’ కూడా హిట్ అవ్వాలి. చూద్దాం... !