ఏకైక తెలుగు సినిమా జైలవకుశ మాత్రమే..!!
on Jul 21, 2018
ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది.సౌత్ కొరియాలో జరిగే బుచీయోన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో జైలవకుశ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయంలో నటించగా,బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.జైలవకుశ చిత్రం అన్నదమ్ముల మధ్య జరిగే అందమైన కథగా సాగుతుంది. ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేద థామస్ హీరోయిన్లుగా నటించారు.ఉత్తమ ఏషియన్ సినిమా విభాగంలో జై లవకుశకు ఈ గౌరవం దక్కింది.ఈ చిత్రోత్సవంలో పాల్గొంటున్న ఏకైక తెలుగు సినిమా జైలవకుశ మాత్రమే కావడం ఫ్యాన్స్ ని ఉబ్బితబ్బి పోయేలా చేస్తుంది.
జైలవకుశతో పాటు ఈ ఛాన్స్ మరో ఐదు సినిమాలకు మాత్రమే దక్కింది. సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై,అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్,శ్రీదేవి మామ్,విజయ్ మెర్సల్ తో పాటు ఎజ్రాలను మాత్రమే ఎంపిక చేసారు. వీటిని ఈ ఫిలిం ఫెస్టివల్ లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. జైలవకుశనే ఎంపికచేయటానికి ముఖ్య కారణం ఒకే హీరో మూడు పాత్రలను చేయటం,వైవిధ్యాన్ని చూపిస్తూ మెప్పించడం, మూడు పాత్రలు ఒకేసారి కలిసే సీన్లు ఉండటమేనని తెలుస్తోంది.ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ నటన మరో స్థాయిలో ఉంటుంది. నత్తితో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అందర్నీ మెప్పించాయి.ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది.జై లవ కుశ తెలుగు చిత్రం కావటంతో సబ్ టైటిల్స్ తో ప్రదర్శించనున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులు తమ కథానాయకుడికి చిత్రానికి ఈ గౌరవం దక్కటం అందులోను తెలుగు నుంచి ఎంపికైన ఏకైక చిత్రం కావటంతో తెగ సంబరపడి పోతున్నారని తెలుస్తుంది.