సల్మాన్ అన్యాయం చేశాడంటున్న బొద్దుగుమ్మ!
on Jul 11, 2015
సల్మాన్ ఖాన్ పై పరిణీతి చోప్రా గుర్రుగా ఉందట. భాయ్ పేరెత్తితేనే చిర్రుబుర్రులాడుతోందట. ఇద్దరూ కలసి నటించనే లేదు....అసలు ఎక్కడ పరిచయమైంది? కోపానికి కారణం ఏంటి? అంటే.... అంతా జాక్వెలిన్ వల్లే అని మూతి తిప్పుతోందట. జాక్వెలిన్ పై సల్మాన్ కు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ తనకు రావాల్సిన ఆఫర్ ఆమె కొట్టేసిందని బాధపడిపోతోందట.
సల్మాన్ నిర్మాతగా....సైఫ్ అలీ ఖాన్ హీరోగా జుగల్ బంది అనే సినిమా నిర్మించాలనుకున్నాడు. ఇందులో పరిణితిని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. అయితే కిక్ షూటింగ్ టైమ్ లో మరో ఆఫర్ ఇస్తానని గర్ల్ ఫ్రెండ్ జాక్వలిన్ కు ప్రామిస్ చేశాడట భాయ్. ఇప్పుడామాట నిలబెట్టుకునేందుకు పరిణితిని పక్కన పెట్టాల్సి వచ్చిందట.
అంతేకాదు సల్మాన్ నయా మూవీ సుల్తాన్ లో హీరోయిన్ గా పరిణితికి ఛాన్స్ దక్కిందనే టాక్ వినిపించినా...అక్కడ కూడా అమ్మడు ఔట్ అవొచ్చంటున్నారు. దీంతో భాయ్ ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదని బొద్దుగుమ్మ గోలచేస్తోంది.