నితిన్ అత్తమామలదీ కులాంతర ప్రేమ వివాహమే
on Feb 17, 2020

ఇండస్ట్రీలో మ్యాగ్జిమమ్ హీరోలు రెడ్డీస్ అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. రామ్‌చరణ్ భార్య పేరు ఉపాసన. ఆమె రెడ్డీస్. అల్లు అర్జున్ వైఫ్ కూడా రెడ్డీసే. ఆమె పేరు స్నేహారెడ్డి. వైయస్ రాజశేఖరరెడ్డి సోదరుడి కుమార్తె వెరోనికారెడ్డిని మంచు విష్ణు పెళ్లి చేసుకున్నాడు. ఇండస్ట్రీలో అసలు సిసలు రెడ్డీస్ కుర్రాడు నితిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యాడు. విశేషం ఏంటంటే... అతడు రెడ్డీస్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు. ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న శాలినిని ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోబోతున్నాడు. అతడు ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు. అదీ ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్. నితిన్‌ది కులాంతర వివాహం అని చెప్పవచ్చు. మరో విశేషం ఏంటంటే... నితిన్ అత్తమామలదీ కులాంతర వివాహమే.
నితిన్‌కి కాబోయే మామగారి పేరు సంపత్‌కుమార్. ఆయనో డాక్టర్. నితిన్‌కి కాబోయే అత్తగారి పేరు నూర్జహాన్. ఆమె కూడా డాక్టరే. సంపత్, నూర్జహాన్‌లది ప్రేమ వివాహమని సమాచారం. వాళ్లకు శాలిని రెండో కుమార్తె. తల్లితండ్రుల తరహాలో శాలిని ఎంబీబీస్ చేయకుండా ఎంబీయే చేశారు. పెళ్లి తర్వాత నితిన్ ఇంట్లో కులాలకు అతీతంగా ప్రతి పండగ చేసుకోవచ్చు. పలు ప్రేమకథల్లో నటించిన నితిన్, ప్రేమ వివాహం చేసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే... నిజజీవితంలో సిగ్గరి అయిన అతడు, ఎవరికీ తెలియకుండా రహస్యంగా ప్రేమకథను నడిపించడం ఆశ్చర్యమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



