'RC15' అప్డేట్.. చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
on Aug 25, 2022
రెండేళ్ల క్రితం ఆగిపోయిన 'ఇండియన్-2' షూటింగ్ మళ్ళీ మొదలు కావడంతో 'RC15' ఆలస్యం కానుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే డైరెక్టర్ శంకర్ మాత్రం త్వరలోనే 'RC15' నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి సర్ ప్రైజ్ చేశాడు.
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో మొదలైన 'ఇండియన్-2'(భారతీయుడు-2) మూవీ కొంత షూటింగ్ పూర్తి చేసుకున్నాక రెండేళ్ల క్రితం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అసలు ఈ మూవీ షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని సమయంలో.. రామ్ చరణ్ ఫిల్మ్ 'RC 15'తో బిజీ అయ్యాడు శంకర్. ఇప్పటికే ఈ చిత్రం సగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా 'ఇండియన్-2' షూటింగ్ మళ్ళీ ప్రారంభమైంది. దీంతో 'RC15' పరిస్థితి ఏంటి? 'ఇండియన్-2' పూర్తయ్యే వరకు 'RC 15'కి బ్రేక్ వచ్చినట్లేనా? అంటూ చరణ్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. అయితే 'RC 15' షూటింగ్ ని వాయిదా వేయట్లేదని తాజాగా క్లారిటీ ఇచ్చి చరణ్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపాడు శంకర్.
'ఇండియన్-2', 'RC 15' సినిమాలను ఏక కాలంలో చిత్రీకరిస్తామని శంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. 'RC15' తదుపరి షెడ్యూల్ కి సిద్ధంగా ఉన్నామని, సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్, వైజాగ్ లో షూట్ చేయనున్నామని పేర్కొన్నాడు. మరోవైపు శంకర్ ట్వీట్ కి చరణ్ రిప్లై ఇచ్చాడు. మిమ్మల్ని సెట్ లో కలవడానికి ఎదురుచూస్తున్నానని, అలాగే 'ఇండియన్-2' షూటింగ్ పున:ప్రారంభం కావడం సంతోషంగా ఉందని అన్నాడు.