ఈ రోజు బెనిఫిట్ షో కి ఏం జరగబోతుంది.. బాలయ్య చూసే ఏరియా ఇదేనా!
on Dec 4, 2025

-అభిమానుల హంగామా స్టార్ట్
-ఏం జరగబోతుంది
-ఆ ఏరియా ఏది!
-బుకింగ్స్ కోసం వెయిటింగ్
ఇంకెన్ని గంటలు మహా అయితే ఏడూ ఎనిమిది గంటలు. ఆ తర్వాత అఖండ 2(Akhanda 2)ఫీవర్ తో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ శివ తాండవం చేస్తూ ఊగిపోనున్నాయి. బాలయ్య వీరాభిమానులైతే ఇప్పటికే థియేటర్స్ వద్దకు చేరుకుని జై బాలయ్య నినాదాలతో ఆ పరిసర ప్రాంగణం మొత్తాన్నిహోరెత్తిస్తున్నారు. పైగా బాలయ్య 'పద్మభూషణ్' అందుకున్నాక వస్తున్న తొలి మూవీ కావడంతో హోరు యొక్క రేంజ్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.
ఇక ఈ రోజు జరగబోతున్న బెనిఫిట్ షో కి అభిమానులు భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. దీంతో అభిమానుల జాతర ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఇప్పుడు ఆ జాతర ని మరింత పెంచేలా బాలయ్య(Balakrishna)హైదరాబాద్(Hyderabad)లేదా విజయవాడ(Vijaywada)లో బెనిఫిట్ షో చూడబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు కానీ బాలయ్య వెళ్లడం కన్ఫార్మ్ అనే న్యూస్ ఒక రేంజ్ లోనే వైరల్ అవుతుంది.
also read: సంక్రాంతి బరిలో శర్వానంద్..పిల్లలు ఆ సినిమా ఫలితాలు గుర్తున్నాయా అంటు నిర్మాత ట్వీట్
ఈ విషయంపై కొంత మంది అభిమానులు స్పందిస్తు 'పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయారు. కాబట్టి బాలయ్య బెనిఫిట్ షో కి రాడని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య వచ్చినా రాకపోయినా అఖండ 2 జాతరతో బాలయ్య అభిమానుల ముందు ఉన్నట్టే. ఇక తెలంగాణకి సంబంధించిన ప్రీమియర్ షో బుకింగ్ తో రెగ్యులర్ బుకింగ్స్ ఓపెనింగ్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



