ఇళయరాజా @ 75...
on Dec 15, 2018

జూన్ 2న స్వరజ్ఞాని ఇళయరాజా పుట్టినరోజు. ఈ ఏడాదితో ఆయనకు 75 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 2, 3వ తేదీల్లో చెన్నైలో ప్రముఖ స్టేడియంలో భారీ ఫంక్షన్ చేయాలని తమిళ చిత్ర పరిశ్రమ నిర్ణయించింది. దక్షిణాదికి చెందిన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినీ ప్రముఖుకు ఈ వేడుకకు హాజరు కానున్నారు. కొందరు హిందీ సినిమా ప్రముఖుల్ని కూడా ఆహ్వానించారు. సుమారు 1000కి పైగా సినిమాల్లో 5000 పాటలకు ఇళయరాజా సంగీతం అందించారు. ఆయన స్వయంగా ఆలపించిన పాటల సంఖ్య 500లకు పైనే. ఎన్నో మధురమైన గీతాలను ప్రేక్షకులకు అందించిన ఆయన్ను తమిళ చిత్ర పరిశ్రమ ఘనంగా సన్మానించాలని సన్నాహాలు చేస్తుంది. తమిళ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఈ వేడుకకు హాజరు కావాలని రెండు రోజుల పాటు షూటింగులకు సెలవు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2, 3వ తేదీల్లో తమిళ సినిమా షూటింగుల్లేవ్. అదండీ సంగతి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



