ఇకనైనా ఆపండి.. అల్లు అర్జున్ పై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!
on Jul 23, 2024
కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా మెగా వర్సెస్ అల్లు వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ (Allu Arjun) మద్దతు తెలపడం ఈ వివాదానికి కారణమైంది. అప్పటినుంచి మెగా అభిమానులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు.. బన్నీని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు, జనసేన మద్దతుదారుడు హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా జరిగిన 'శివం భజే' ట్రైలర్ లాంచ్ వేడుకలో మెగా-అల్లు వివాదంపై మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురు కాగా.. హైపర్ ఆది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నర్. ఆయన మీద ట్రోల్స్ చేసే వారికి జనరల్ గా చెప్తున్నాను.. పవన్ కళ్యాణ్ గారికి గానీ, మిగతా మెగా ఫ్యామిలీకి గానీ అటువంటి ఫీలింగ్ లేదు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇకనుంచైనా ఇలాంటివి ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అని హైపర్ ఆది అన్నాడు.
Also Read