హృతిక్ మాయలో పూజా హెగ్డే?!
on Jun 1, 2015
ఒకలైలా కోసం, ముకుంద సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పూజా హెగ్డే. ఆ తరవాత బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ హృతిక్ రోషన్‌తో మొహంజదారో అనే సినిమాలో కథానాయికగా నటిస్తోంది. మూడో సినిమాకే బాలీవుడ్ చాన్స్ రావడం పట్ల పూజా ఎగిరి గంతేసింది. తన కోసం వచ్చిన కొన్ని దక్షిణాది ఆఫర్లనూ పక్కన పెట్టేసింది. ప్రస్తుతం ముంబై, రాజస్థాన్‌లలో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. షూటింగ్ సందర్బంగా హృతిక్ కి పూజా బాగా దగ్గరైపోయిందట. తన సీన్లేం లేకపోయినా.. హృతిక్ కోసం సెట్స్‌కి వెళ్తోందని, షూటింగ్ అయ్యాక ఇద్దరూ కలసి ముంబై వీధుల్లో చక్కర్లుకొడుతున్నారని బాలీవుడ్ టాక్. భార్యకు విడాకులిచ్చిన హృతిక్ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. పూజా రూపంలో హృతిక్‌కి ఓ తోడు దొరికిందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి. అయితే ఈ పుకార్లపై పూజా ఏమాత్రం స్పందించడం లేదు. మరి వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
