హిమజది ఒంటరి బ్రతుకు!?
on May 3, 2020

క్యారెక్టర్ ఆర్టిస్ట్ హిమజ అందానికి దాసోహమైన అభిమానులు ఎక్కువే. జెమిని టీవీలో 'స్వయంవరం' సీరియల్ ద్వారా నటిగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆమెకు... వెండితెరపై వచ్చిన 'నేను శైలజ', 'మహానుభావుడు', 'శతమానం భవతి', 'నెక్స్ట్ నువ్వే', 'చిత్రలహరి' చిత్రాలలో పాత్రలు మరింత గుర్తింపు తెచ్చాయి. సెలబ్రిటీల లైఫ్ గురించి సామాన్యులు తెలుసుకోవాల్సిన అనుకోవడం సహజమే కదా! అలాగే, హిమజ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలి అనుకునే ప్రేక్షకులు ఉన్నారు. 'మీకు పెళ్లి అయిందా? మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు?' అని ఒక నెటిజన్ ఆమెను అడిగారు.
"నా జీవితాన్ని చాలా సంవత్సరాలుగా ఒంటరిగానే వెళ్లదీస్తున్నా. మామూలుగా పేరెంట్స్ నాతోనే ఉంటారు. లాక్ డౌన్ వల్ల విజయవాడలో స్టక్ అయ్యారు" అని హిమజ చెప్పారు. తన వయసు ఎంతో చెప్పడానికి మాత్రం ఆమె ఇష్టపడలేదు. సున్నాకి చావుకి మధ్యలో ఉన్నానని వేదాంతధోరణిలో సమాధానం ఇచ్చారు. తన ఎత్తు ఐదు అడుగుల 8 అంగుళాలు అని తెలిపారు.
లాక్ డౌన్ తొలగించిన తర్వాత విజయవాడలో ఉన్న మా అమ్మమ్మ గారు ఇంటికి వెళతానని హిమజ అన్నారు. అయితే... జూన్ ఒకటో తారీకు వరకు లాక్ డౌన్ పొడిగించడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. కథానాయికులలో సమంత, నటీమణుల్లో హరితేజ అంటే తనకు ఇష్టమని హిమజ చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



