వాళ్లు దొరక్కపోరూ... కొడుకులు తడిసిపోవాలి
on Jul 31, 2017
‘సినిమా ఆడాళ్ల తలకు న్యూడ్ బాడీలు అంటించి వ్యాపారం చేసుకుంటున్న వెధవలున్నారు మీడియాలో. సినిమా ఆడకూతుళ్ల పై ఇష్టం వచ్చిన్నట్లు అవాకులు చెవాకులు రాసి పొట్ట పోసుకుంటున్న సంస్కారం లేని వారు కూడా ఉన్నారు. సమాజానికి తామెవరో తెలీయకుండా వారు ఈ పనులు చేస్తున్నారు. ఎప్పుడో దొరక్కపోరు. కొడుకులకు తడిసి పోవాలి’ఈ మాటలంది ఎవరోకాదు. సినిమా ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నటి హేమ. ఇటివల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలనాన్ని కలిగించే విధంగా మాట్లాడారు.
‘సినిమా వాళ్లకు కూడా ఓ కుటుంబం ఉంటుంది. వాళ్లకు కూడా బాధ్యలుంటాయి. ఈ విధంగా మాపై లేనిపోనివి రాస్తూ.. అసభ్యకరంగా ప్రవర్తిస్తే... మా ఆడపిల్లలకు పెళ్లిల్లు అవుతాయా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు హేమ.
‘ప్రపంచం మొత్తం డబ్బు, సెక్స్ చుట్టూనే తిరుగుతోంది. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయమే. ఆడా మగా ఉన్న ప్రతి చోట ఇవి కామన్. అన్ని రంగాలపై వీటి ప్రభావం ఉంటుంది. అలాంటప్పుడు ఒక్క సినిమా వాళ్లనే టార్గెట్ చేయడం మీడియాకు సమంజసం కాదు’ అన్నారు హేమ.
‘14 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకొచ్చాను. నా విషయంలో ఎవరూ ఇప్పటి వరకూ మిస్ బిహేవ్ చేయలేదు. నేను చూసిన సినిమా రంగంలో అందరూ చదువుకున్న వాళ్లే. సంస్కార వంతులే. పక్కలోకి చేరితేనే అవకాశాలిస్తారు అనేది కేవలం వదంతులు మాత్రమే. సినిమా
పరిశ్రమలో ఇలాంటి సాంప్రదాయమే ఉంటే... పెద్ద కుటుంబాలకు సంబంధించిన ఆడకూతుళ్లను ఈ రంగంలో ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?’అని సూటిగా ప్రశ్నించారు హేమ.
‘హేమా ఆంటీకి అవకాశాలు తగ్గాయి కాబట్టే రాజకీయాల్లోకి వచ్చారు? అని చాలామంది అభిప్రాయం?’ అని సదరు ఛానల్ కి సంబంధించిన జర్నలిస్ట్ అడిగితే... ‘హేమ ఆంటీ ఏంటి? ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఒళ్లు మండుద్ది. మీ కంటికి నేను ఆంటీలా
కనబడుతున్నానా?’ అంటూ అంతెత్తు లేచారు హేమ. తన కెరీర్ మంచి పీక్ లో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ప్రచారం చేశానని హేమ గుర్తు చేశారు.
మీరు బాగా స్నేహంగా ఉండే పూరీ జగన్నాథ్ కూడా మీకు వేషాలు ఇవ్వడంలేదంటే మీరు అవుట్ డేటెడ్ అయిపోయారనేగా? చివరకు తల్లి వేషాలు కూడా రావడం లేదు మీకు! అని అడిగితే... ‘పూరి జగన్నాథ్ నన్ను సొంత చెల్లెలుగా చూస్తాడు. నాకు తల్లి వేషాలు ఇవ్వనని ముఖం మీదే చెప్పాడాయన. ఎందుకు? అని నేనడితే... నువ్వు తల్లిగా చేయడం ఏంటమ్మా.. నిన్ను మదర్ గా జనాలు ఒప్పుకోరు’ అన్నారాయన. అయినా నాకు తల్లి వేషాలు వేయడం ఇష్టం లేదు‘ అని తేల్చి చెప్పారు హేమ.
ఇంత నిర్మొహమాటంటా మాట్లాడుతుంది కాబట్టే... హేమను పరిశ్రమలో అందరూ ఫైర్ బ్రాండ్ అంటుంటారు.