హనుమాన్ ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ...ప్రకటించిన సినీ సంస్థ
on Jan 22, 2024
రామదూత హనుమాన్ కి తన ప్రభువు శ్రీ రామ చంద్రుడు మీద ఎంత భక్తి ఉంటుందో అంత కంటే రెట్టింపు ప్రేమ హనుమంతుడు మీద ఆయన భక్తులకి ఉంటుంది. అందుకు నిదర్శనంగా మొన్న సంక్రాంతికి వచ్చిన హనుమాన్ (hanuman)మూవీనే ఒక ఉదాహరణ. తెలుగు ప్రేక్షకులతో పాటు హనుమాన్ భక్తులు హనుమాన్ మూవీకి ఘన విజయాన్ని అందించారు. ఈ క్రమంలో హనుమాన్ భక్తుల కోసం ఒక తియ్యని వార్త ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలిచింది
అయోధ్యలో ఈ రోజు రామమందిర శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న శుభతరుణంలో చైన్ మిరాజ్ సినిమాస్ అనే ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ సినీ ప్రియులకు ఒక ఆఫర్ ని ఇచ్చింది. వారు ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఏరియాల్లో మల్టీప్లెక్స్ చైన్ ద్వారా నేడు హనుమాన్ మూవీకి సంబంధించి ఒక టికెట్ కొంటే ఇంకొకటి ఫ్రీ అనే ఆఫర్ ని ఇచ్చింది. దీంతో హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ఇండియా వ్యాప్తంగా ఉన్న మిరాజ్ మల్టీప్లెక్స్ కి తరలివెళ్తున్నారు.
ప్రశాంత్ వర్మ(prashanth varama)దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ లో తేజ సజ్జ (teja sajja) వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ (varalaxmi sarath kumar) అమృత అయ్యర్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, సత్య, గెటప్ శ్రీనులు చాలా సూపర్ గా నటించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి హనుమాన్ ని నిర్మించాడు. ఇటీవలే అయోధ్య రాముడికి హనుమాన్ టీం 2 కోట్ల భారీ విరాళాన్ని ఇచ్చింది.
Also Read