హన్సిక ఓకే కాలేదట
on Jun 11, 2015
అల్లు అర్జున్ , హన్సిక మరోసారి జోడి కట్టనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హన్సిక ఇంకా ఓకే కాలేదట.
ప్రస్తుతం ఆమె పేరు పరిశీలిస్తున్నామంతే అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్లేసులో ఎవరినైనా తీసుకోవచ్చని అంటున్నారు. దీంతో బోయపాటి, అల్లుఅర్జున్ సినిమాకి సంబంధించి హీరోయిన్ల వేట ఇంకా ఓ కొలిక్కి రాలేదని అర్థమవుతోంది. మరో రెండు నెలల వరకు మంచి రోజులు లేని కారణంగా ముందుగా ఈ సినిమాను ప్రారంభించి.. కాస్టింగ్ పూర్తయిన తరువాత రెగ్యులర్ షూటింగ్ జరుపుతారట.