మిర్చీభామ హంసానందినికి తప్పిన ప్రమాదం
on May 27, 2014
.jpg)
ఐటెమ్ సాంగ్స్ ద్వారా దక్షిణాదిలో గుర్తింపు సంపాదించుకున్న హంసానందిని కారు ప్రమాదం నుంచి తప్పించుకొని క్షేమంగా బయటపడింది అని సమాచారం. కడప జిల్లా నుంచి హైదరాబాద్ వైపు కారులో ప్రయాణిస్తు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే, మహబూబ్‌నగర్ జిల్లా మునిరంగస్వామి ఆలయ సమీపంలోకి రాగానే ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ అయిందని, దాంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో హంసానందినికి చిన్నగాయాలు అయ్యాయని చెప్తున్నారు. ఆ సమయంలో ఆమెతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని తెలుస్తోంది. డ్రైవర్ సమయస్ఫూర్తి వలన ప్రాణాపాయం తప్పిందని వారు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఫోన్ చేసి ఆమె క్షేమా సమాచారం తెలుసుకున్నారట. ‘అత్తారింటికి దారేది’,‘మిర్చీ’ సినిమాలలో ఐటమ్ భామగా పేరు తెచ్చుకున్న హంసానందినికి ప్రాణసంకటం తప్పినందుకు ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



