గోపీచంద్ వర్సెస్ వరుణ్ తేజ్!
on Dec 23, 2021

ప్రీవియస్ మూవీ `సీటీ మార్`తో చెప్పుకోదగ్గ సక్సెస్ చూసిన మ్యాచో స్టార్ గోపీచంద్.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో `పక్కా కమర్షియల్` సినిమా చేస్తున్నాడు. రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ కోర్ట్ డ్రామా.. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. హోలీ స్పెషల్ గా వచ్చే ఏడాది మార్చి 18న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తన్నారు.
ఇదిలా ఉంటే.. మరోవైపు అదే తేదికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా `గని`ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. వాస్తవానికి రేపు (డిసెంబర్ 24) థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం.. మార్చి 18ని రిలీజ్ డేట్ గా లాక్ చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే `గని` రిలీజ్ డేట్ పై క్లారిటీ రానున్నది. మరి.. గోపీచంద్ వర్సెస్ వరుణ్ తేజ్ అన్నట్లుగా ఉన్న హోలీ బరిలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
Also read:షూటింగ్‌లో టైగర్ ష్రాఫ్ కంటికి గాయం!
కాగా, నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించిన `గని`లో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ నాయికగా నటించగా.. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా, నరేశ్, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



