మార్చి 1.. ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ న్యూస్!
on Jan 23, 2026

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
మార్చి 1న బిగ్ సర్ ప్రైజ్!
సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం
'ది రాజా సాబ్' మూవీతో ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే వారి నిరాశను పోగొట్టేలా మార్చి 1న బిగ్ న్యూస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మార్చి 1 ప్రత్యేకత ఏంటి? ఆ రోజు రాబోతున్న న్యూస్ ఏంటి?
ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ 'స్పిరిట్'(Spirit)ను సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేస్తున్నాడు. కొరియన్ స్టార్ డాన్ లీ(Don Lee) ఇందులో నటిస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ త్వరలో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.
మార్చి 1న డాన్ లీ పుట్టినరోజు. అందుకే ఆ రోజు 'స్పిరిట్'లో డాన్ లీ నటిస్తున్న విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ, స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి ప్లాన్ చేశాడట. అదే జరిగితే సోషల్ మీడియా షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు.

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబో కావడంతో ఇప్పటికే 'స్పిరిట్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు వీరికి డాన్ లీ కూడా తోడైతే అంచనాలు మరో స్థాయికి వెళ్తాయి.
టీ సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్న 'స్పిరిట్'లో త్రిప్తి డిమ్రి, వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.
Also Read: NBK111 డైరెక్టర్ మారిపోయాడా..?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



