గేమ్ చేంజర్ కి ఆ దర్శకుడు మూవీకి ఎలాంటి సంబంధం లేదు
on Nov 30, 2024

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్(shankar)కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్. వరల్డ్ వైడ్ గా సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల కాబోతుండగా ప్రమోషన్స్ లో కూడా వేగం పెరిగింది.ఈ క్రమంలోనే రీసెంట్ గా "నానా హైరానా" అనే ఒక అద్భుతమైన లిరిక్స్ తో కూడిన మెలోడీ సాంగ్ రిలీజయ్యి రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.
ఇక 'గేమ్ చేంజర్' రెండు పార్టులుగా తెరకెక్కబోతుందనే రూమర్స్ ఇప్పుడు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.గతంలో శంకర్ తెరకెక్కించిన ఒక సినిమాకి సీక్వెల్ కాన్సెప్ట్ గా వస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి.ఈ విషయంపై చిత్ర బృందం మాట్లాడుతు ఈ రెండు వార్తల్లో ఎలాంటి నిజం లేదు. గేమ్ చేంజర్ కి సీక్వెల్ గాని,సెకండ్ పార్ట్ గాని లేదు.పూర్తిగా సోలో సినిమా అని వెల్లడి చేసింది.గతంలో కూడా గేమ్ చేంజర్ పై ఇలాంటి వార్తలే వచ్చాయి.
ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని త్వరలోనే భారీ ఎత్తున చెయ్యబోతున్నారు. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతాడనే వార్తలు వస్తున్నాయి. కాకపోతే చిత్ర బృందం అధికారకంగా వెల్లడి చెయ్యలేదు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు(dil raju)అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న గేమ్ చేంజర్ లో చరణ్ సరసన కియారా అద్వానీ(kiyara adwani)జత కట్టగా అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.థమన్ మ్యూజిక్ ని అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



