పవర్‌స్టార్ గుండెకు గాయమైందట!
on Dec 12, 2017
‘అజ్ఙాతవాసి.. అజ్ఙాతవాసి.. అజ్ఙాతవాసి’... ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ నామస్మరణే. ‘బయటకొచ్చి చూస్తే టైమేమో.. 3'o clock’ అంటూ శాంపిల్ గా ఓ పాట రిలీజ్ చేస్తేనే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్. రీసెంట్ గా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు... దీంతో అభిమానుల్లో సంక్రాంతి హడావిడీ షురూ అయ్యింది. ఈ హడావిడిని కొనసాగిస్తూ... రెండో పాటను కూడా మంగళవారం విడుదల చేశారు. గాలివాలుగా ఓ గులాబీ... గాయమైంది గుండెకు తగిలి’ అంటూ సాగిన ఈ పాట ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
అనిరుథ్ పాడిన ఈ పాటలో సాహిత్యం నిజంగా హైలెట్. ఇదిలావుంటే... ‘అజ్ఙాతవాసి’లో ఫైట్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయంటండోయ్. దాదాపు ఏడు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట ఇందులో. త్రివిక్రమ్ గత చిత్రాల్లో లేనంత యాక్షన్ పార్ట్ ఈ సినిమా ఉంటుందని సమాచారం. పవర్ స్టార్ ఫైట్స్ అభిమానుల్ని రోమాంచితుల్ని చేస్తాయట. కీర్తి సురేశ్, అను ఇమ్మానుయేల్ కథాానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Also Read