విక్టరీ వెంకటేష్ కు నోటీసులు
on Nov 19, 2014
టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ కు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. వెంకటేష్ ఫిలింనగర్ రోడ్ నెంబర్.1 లో తన స్థలంలో జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా నిర్మాణాలు మొదలుపెట్టడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నిర్మాణాలపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకపొతే అక్రమ నిర్మాణాల కింద వాటిని కూల్చివేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. మరోవైపు వెంకటేష్ గోపాల గోపాల సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి వున్న ఫస్ట్ లుక్ ఫోటోను త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.