Funky: ఫంకీ హైలెట్స్ ఇవే.. ప్రేక్షకులు చెప్పేది నిజమేనా!
on Feb 13, 2026

-ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టిన ఫంకీ
-విశ్వక్ సేన్ ఈ సారి హిట్ అందుకున్నాడా!
-అభిమానులు, ప్రేక్షకులు ఏమంటున్నారు
మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్'(Vishwak Sen)ఈ రోజు 'కయదు లోహర్'(kayadu LOhar)తో కలిసి 'ఫంకీ'(funky)అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టాడు. ప్రచార చిత్రాల ద్వారా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్(Anudeep)మరోసారి తనదైన కామెడీ పంచులతో మెస్మరైజ్ చెయ్యబోతున్నాడని అర్దమవ్వడంతో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ కి భారీగానే పోటెత్తుతున్నారు. మరి వాళ్ళు థియేటర్ నుంచి బయటకి వచ్చాక ఫంకీ లో కొన్ని హైలెట్స్ మమ్మల్ని అలరించాయని చెప్తున్నారు. అవేంటో చూద్దాం
1 .విశ్వక్ సేన్, కయదు లోహర్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు ఆ ఇద్దరి మధ్య వచ్చిన సీన్స్
2 .తికమకకి గురి చేసే విశ్వక్ సేన్ క్యారక్టర్ డిజైన్, ఆ సందర్భంగా వచ్చిన డైలాగ్స్
3 .మిగతా క్యారెక్టర్స్ మధ్య నడిచిన కామెడీ పంచులు
4 . విశ్వక్ సేన్ తో పాటు తన తల్లి మధ్య వచ్చిన సీన్స్
5 . గలీజు అనే వర్డ్ విషయంలో విశ్వక్ సేన్ చెప్పే లాజిక్స్
6 . చివర్లో విశ్వక్ సేన్ ఒరిజినల్ క్యారక్టర్ రివీల్ అవ్వడం
7 . ప్రీ క్లైమాక్స్
8 . క్లైమాక్స్
9 . నాగవంశీ నిర్మాణ విలువలు
ఈ విధమైన హైలెట్స్ మూవీ చూసిన వారి దగ్గర్నుంచి వ్యక్తమవుతున్నాయి. విశ్వక్ సేన్ గత చిత్రాలతో పోల్చుకుంటే బెటర్, నాట్ బ్యాడ్ అనే టాక్ ని కూడా వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫంకీ ఏ మేర కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



