ఫరియా అబ్దుల్లా లవర్ ఎవరో తెలిసిందోచ్.. మీకు ఆ వ్యక్తి ఓకేనా
on Jan 21, 2026

వైరల్ గా మారిన ఫరియా ప్రేమ వ్యవహారం
డాన్సింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఎవరు
హైదరాబాద్ కా బాద్షా నేనా!
తెలుగు సినిమా ప్రేమికులు 'జాతిరత్నాలు' లోని చిట్టి సాంగ్ ని ఎంతగానో హమ్ చేశారు. దీంతో ఫరియా అబ్దుల్లా(Fariya Abdullah)తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందడం ఖాయమని అందరు భావించారు. కానీ ఎవరి దిష్టి తగిలిందో ఏమో స్టార్ స్టేటస్ అనేది ఇంకా ఆమెకి అందని స్ట్రా బెర్రీ లా మారింది. అందుకు కారణాల గురించి ప్రస్తుతం మనకి అవసరం లేదు. రీసెంట్ గా సోషల్ మీడియా షేక్ అయ్యే న్యూస్ ని ఫరియా వెల్లడి చేసింది.
ఒక ఇంటర్వ్యూ లో తన పర్సనల్ విషయాలపై మాట్లాడుతు నేను ప్రేమలో ఉన్నాను.ఆ విధంగా ప్రేమలో ఉండటం వల్ల నా లైఫ్ సమతుల్యంగా ఉండటంతో పాటు నా బిజీ షెడ్యూల్ కి మృదువైన మెరుపుని అందిస్తుంది. నా లవర్ ఒక హిందువు. సినీరంగానికి చెందినవాడు కాదు. డాన్సింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాడని చెప్పింది. ఇక ఫరియా తన లవర్ గురించి అలా చెప్పిందో లేదో ఇంటర్నెట్ డిటెక్టివ్‌లు రంగంలోకి దిగి ఆ లవర్ ఎవరై ఉంటారా అని తమ మస్తిష్కాలని బిజీ మోడ్ లో ఉంచారు.
Also read: మన శంకర వర ప్రసాద్ గారు హిందీ రీమేక్! ఈ హీరో మీకు ఓకేనా!
పక్కా హైదరాబాదీ అయిన ఫరియా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండటంతో పాటు యూట్యూబ్ ఛానల్ కి కూడా రన్ చేస్తుంది. ఫరియా నుంచి వచ్చిన ప్రీవియస్ మూవీ గుర్రం పాపిరెడ్డి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



