ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్..!
on Apr 15, 2024
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'(Family Star). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలైంది. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో విడుదలకు ముందు 'ఫ్యామిలీ స్టార్'పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. రూ.40 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. కేవలం రూ.20 కోట్ల లోపు షేర్ కి పరిమితమై ఘోర పరాజయం దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు, త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
'ఫ్యామిలీ స్టార్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయినట్లు సమాచారం. మే 3 నుంచి ఓటీటీలో స్టీమింగ్ చేయనున్నారట. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతుంది అన్నమాట.
Also Read