అమెరికా నుండి హైదరాబాద్ కి టాప్ స్టార్ ని రప్పిస్తున్న దిల్ రాజు!
on Dec 26, 2023
.webp)
విజయ్ దేవరకొండ నటిస్తున్న నయా మూవీల్లో వన్ ఆఫ్ ది మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ టైటిల్ ప్రకటించినప్పుడే ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ కోసం దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ వెయిటింగ్ లో ఉన్నారు. హిట్ చిత్రాల దర్శకుడు పరశురామ్ దర్సకత్వంలో ఫ్యామిలీ మాన్ రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఫ్యామిలీ స్టార్ మూవీ ఇటీవలే అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంది. సినిమాకి సంబంధిచిన కొన్ని కీలక సన్నివేశాలని చిత్ర యూనిట్ అక్కడ చిత్రీకరించింది. ఇప్పుడక్కడ షెడ్యూలని కంప్లీట్ చేసుకొని చిత్ర బృందం హైదరాబాద్ బయలుదేరింది. మళ్ళీ ఇంకో వారం రోజుల్లో హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈ విషయాలన్నింటి మీద చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికార ప్రకటన రానుంది.

విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడి కడుతుండగా దివ్యాన్షా కౌశిక్ మరో హీరోయిన్ గా చేస్తుంది. రంగస్థలం ఫేమ్ అజయ్ ఘోష్ కీలక పాత్ర పోస్తిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. విజయ్ దేవరకొండ పరశురామ్ కలయికలో ఇంతకు ముందు వచ్చిన గీత గోవిందం సూపర్ సూపర్ హిట్ గా నిలిచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



