ఉస్తాద్ పొలిటికల్ ప్రోమో.. గ్లాస్ డైలాగ్ తో గట్టిగా...
on Mar 16, 2024
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి ఊహించని అప్డేట్ రాబోతుంది అంటూ తాజాగా మైత్రి సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి పొలిటికల్ ప్రోమో రాబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ సింబల్ అయిన టీ గ్లాస్ ని ప్రస్తావిస్తూ ఆ ప్రోమోలో అదిరిపోయే డైలాగ్ ఉంటుందట.
అసలే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి పొలిటికల్ ప్రోమో విడుదలైతే.. అది ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వడంతో పాటు, ఒక్కసారిగా వైరల్ అవుతుంది అనడంలో సందేహం లేదు. పైగా ఈ ప్రోమోలో అధికార పార్టీ పైన పరోక్షంగా ఏమైనా సెటైర్లు ఉంటాయా అనే ఆసక్తి కూడా అందరిలో నెలకొంది.
Also Read