మాకు కూడా ఆ కోరికలు ఉంటాయి.. రెండో పెళ్లి చేసుకుంటున్న ఎస్తేర్
on Jun 21, 2024

ఎస్తేర్ నోరోన్హా( Ester noronha)2013 లో పూరి జగన్నాధ్ సోదరుడు సాయి రామ్ శంకర్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన వెయ్యి అబద్దాలు తో తెలుగు సినీ సీమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత సునీల్ హీరోగా 2014 లో వచ్చిన భీమవరం బుల్లోడులో కూడా తళుక్కుమంది. అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఆ చిత్రాన్ని నిర్మించడంతో ఇక ఆమెకి తెలుగు నాట ఎదురులేదని భావించారు. మంచి నటి అనే పేరు కూడా తెచ్చుకుంది. కానీ హిట్స్ ని మాత్రమే కొలమానంగా తీసుకునే పరిశ్రమలో ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. కానీ ఇటీవల వచ్చిన 69 సంస్కార్ కాలనీ, రెక్కీ వెబ్ సిరీస్ లాంటి రొమాంటిక్ చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.రొమాన్స్ కి సరికొత్త అర్ధాన్ని చెప్తు సినిమా లుక్ నే మార్చివేసే సత్తా ఆమె సొంతం. దీంతో ఆమెకి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది.
ఎస్తేర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ వచ్చింది. అందులో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలుగు నాట వైరల్ గా నిలిచాయి.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి అందరు మగవాళ్లనే అంటారు. వాళ్ళు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా ఆఫర్ చేయడం ఇండస్ట్రీలో ఉంది. అయితే అవకాశాల కోసం క్యారెక్టర్ మార్చుకోను.ఈ కారణంతోనే గతంలో చాలా సినిమాలు మిస్ అయ్యాయి.పైగా మోడ్రన్ డ్రస్సులు వేసుకుంటే ట్రోల్ చేస్తారు. అంతే కాదు వేశ్య అని ముద్ర వేస్తారు. ఆడవాళ్ల కి కూడా కోరికలు ఉంటాయి. అలా కోరికలు కలిగి ఉండటాన్ని ప్రస్తుత సమాజం పెద్ద నేరంలా భావిస్తుంది. అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడవాళ్ళకి కూడా ఒక జీవితం ఉంటుంది. వారికి కూడా ఎమోషన్స్ ఉంటాయని చెప్పుకొచ్చింది.
ఇక ఇదే ఇంటర్వ్యూ లో మళ్లీ పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్న వచ్చింది.నాకు ఒంటరిగా ఉండాలని లేదు. రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇక ఎస్తేర్ 2019 లో సింగర్ నోయల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ సంవత్సరంలోపే విడిపోయారు. ప్రస్తుతం ది వేకెంట్ హౌస్ అనే మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా ఎస్తేర్ నే చేపడుతుంది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



