కిరణ్ అబ్బవరం ‘క’ని కొన్న స్టార్ హీరో.. హిట్ ఇస్తాడా!
on Sep 9, 2024
ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(kiran abbavaram)కొత్త మూవీ ‘క’(ka)కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉండి మూవీ మీద అందరిలో ఆసక్తిని పెంచింది. పైగా కిరణ్ అబ్బవరం కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది ఆయ్ మూవీ ఫేమ్ నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా చేస్తుండగా తాజా న్యూస్ ఒకటి ‘క’ రేంజ్ ని చాటి చెప్తుంది.
ప్రముఖ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(dulquer)‘క’ మలయాళ హక్కులని తీసుకున్నాడు. తన వేఫర్ర్ ఫిలిమ్స్ పతాకంపై ‘క’ ని భారీ స్థాయిలో మలయాళంలో విడుదల చెయ్యబోతున్నాడు. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. అలాగే కిరణ్ అబ్బవరం తో పాటు చిత్ర బృందం కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నాడు. రిలీజ్ డేట్ కూడా త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది.సుజీత్, సందీప్ అనే ఇద్దరు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
ఇక దాదాపు ఏడాది విరామం తర్వాత ‘క తో కిరణ్ అబ్బవరం(kiran abbavaram)తెలుగు ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. గత చిత్రాలైన మీటర్, రూల్స్ రంజన్ డిజాస్టర్స్‌గా నిలవడంతో కిరణ్ ఆశలన్నీ ‘క’ మీదనే ఉన్నాయి. ఇటీవలే తన తొలి మూవీ హీరోయిన్ రహస్య గోరక్ ని కిరణ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Also Read