నటుడి భార్యకు మరొకరితో ఎఫైర్?
on May 21, 2020
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి విడాకుల కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది. తొలుత విడాకులు కోరుతూ వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపిన అలియా సిద్ధిఖి, తర్వాత నవాజుద్దీన్ తమ్ముడు షమాస్ మీద విమర్శలు చేశారు. అతడు తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని పేర్కొన్నారు. అన్నయ్య విడాకుల వివాదం మీడియాల్లో వార్తలు చూసి తెలుసుకున్నని, అసలు తనకు ఏమీ తెలియదని తమ్ముడు షమాస్ వ్యాఖ్యానించాడు. తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఏంటంటే... ఆలియాకు వేరొకరితో ఎఫైర్ ఉందని ముంబైలో గుసగుసలు వినిపించడం!
ఇటీవల ఆలియా అలియాస్ అంజనా కిషోర్ పాండే వాట్సాప్ డీపీలో పెట్టిన ఒక ఫొటోలో ఆమెతో పాటు మీడియాలో పనిచేసే పీయూష్ పాండే ఉన్నాడట. విడాకుల వార్త బయటకు రాగానే, ఆ ఫొటో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. పీయూష్ పాండేతో అంజనా కిషోర్ పాండే డేటింగ్ చేస్తున్నారని గుసగుస. అది వట్టి పుకారు మాత్రమేనని పీయూష్ చెబుతున్నారు. మీడియాలో వార్త చూశాక తనకు విడాకుల విషయం తెలిసిందని, ఈ వ్యవహారంలో తాను బలిపశువు అయ్యానని, మధ్యలో తనను ఎందుకు లాగారో అర్థం కావడం లేదని పీయూష్ పేర్కొన్నారు. తాను వేరొకరితో రిలేషన్షిప్లో ఉన్నట్టు, తనకు అలియా మంచి స్నేహితురాలు అని అతడు చెబుతున్నాడు. చక్కర్లు కొడుతున్న ఫొటోలో తాను డేటింగ్ చేస్తున్న అమ్మాయిని క్రాప్ చేశారని తెలిపాడు. నవాజుద్దీన్, ఆలియాకు సన్నిహితంగా ఉండే వ్యక్తులకు, వాళ్ళిద్దరి గొడవ ఏంటో తెలుసనీ, కొత్తగా తాను చెప్పాల్సింది ఏమీ లేదని పీయూష్ పేర్కొన్నాడు. అన్నట్టు... అలియాకు పీయూష్ పరిచయమైంది నవాజుద్దీన్ ద్వారానే. నవాజుద్దీన్ దగ్గర మూడేళ్లు పీయూష్ పనిచేశాడు. తర్వాత మానేశాడు.
Also Read