అంతా సెట్ చేస్తా..రంగంలోకి దిగిన గేమ్ చేంజర్
on Dec 24, 2024
గేమ్ చేంజర్(game changer)కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు అమెరికా వెళ్లడం జరిగింది.ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం దిల్ రాజు(dil raju)ని FDC చైర్మన్ గా కూడా నియమించింది.తాజాగా దిల్ రాజు సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటనలో గాయపడి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న శ్రీ తేజ్ వద్దకి వెళ్లి బాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతు పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం.ఇలాంటివి సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు చూస్తుంటాం.ప్రభుత్వానికి, సినిమాకి వారధిలా ఉండాలని నన్ను FDC చైర్మన్ గా సిఎం నియమించారు..రేవతి భర్త భాస్కర్ ని ఇండస్ట్రీ కి తీసుకుని వచ్చి జాబ్ ఏర్పాటు చేస్తాం.ప్రభుత్వానికి ఇండస్ట్రీ కి మధ్యలో ఉండి,కుటుంబ భాద్యత కూడా మేము తీసుకుంటాం..FDC ద్వారా వీరికి ఏవిధమైన సహకారం అందించగలిగితే అవి అందిస్తాం.ప్రస్తుతానికి శ్రీ తేజ ఆరోగ్యం కుదుట పడుతుంది..యుఎస్ నుంచి ఈ రోజు రాగానే సిఎం రేవంత్ రెడ్డి గారిని కలిశాను. వీరి బాధ్యత తీసుకోవడంపై ఆయనతో చర్చించాను.ఒకే అన్నారు..ఎవ్వరూ కావాలని చెయ్యరు..నేను అల్లు అర్జున్(allu arjun)ని కలవబోతున్నాను.సిఎం ఆదేశాల మేరకే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పుకొచ్చాడు.
Also Read