ధురంధర్ ప్రస్తుత కలెక్షన్స్ ఎంతో తెలుసా! వాళ్ళకి ఊపిరి ఇచ్చిందా!
on Dec 26, 2025

-బాలీవుడ్ ని సేవ్ చేసిందా!
-కలెక్షన్స్ ఎంత
-పూర్తి రన్నింగ్ లో ఎంత వస్తాయి
వరుస పరాజయాలతో కథల ఎంపికపై, మేకింగ్ పై విమర్శలు ఎదుర్కుంటున్న బాలీవుడ్ సినీ ముఖ చిత్రాన్నే మార్చివేసిన చిత్రం'ధురంధర్'(Dhurandhar). ముఖ చిత్రాన్ని మార్చడమే కాదు ఒక కొత్త ఊపిరిని కూడా ఇచ్చింది. దీంతో బాలీవుడ్ తన మునుపటి వైభవాన్ని పొందడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ధురంధర్ ఘన విజయంతో మేకర్స్, హీరోలు సరికొత్త కథలకి అంకురార్పణ చేయడం ఖాయం. దీని వల్ల భారతీయ సినీ ప్రేమికులకి మరింత సినీ వినోదం లభించడం పక్కా.
ఇక సిల్వర్ స్క్రీన్ పై ధురంధర్ తన ప్రభావాన్ని యధావిధిగా కొనసాగిస్తు రీసెంట్ గా వెయ్యి కోట్ల క్లబ్ లోకి ప్రవేశించింది. మేకర్స్ ఈ మేరకు అధికారకంగా ప్రకటిస్తు ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. సదరు పోస్టర్ లో 1006 .7 కోట్ల గ్రాస్ ని రాబట్టిందని, ఇండియాలో 789 .18 కోట్లు, ఓవర్ సీస్ లో 217 .50 కోట్లు వసూలు చేసినట్టుగా కూడా చెప్పారు. డిసెంబర్ 5 న రిలీజైన ధురంధర్ రిలీజైన ఇరవై రెండు రోజులకే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిందంటే పూర్తి రన్నింగ్ లో ఎన్ని కలెక్షన్స్ వసూలు చేస్తుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. బాలీవుడ్ లో ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం కూడా ధురంధర్ నే.
Also read: రవితేజ పై తేజ సజ్జ కీలక వ్యాఖ్యలు.. మన విలువ తెలియడం పక్కా

.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



