శృతిహాసన్ కి పేరుపెట్టిన దేవిశ్రీ
on Jul 27, 2015
శ్రీమంతుడు ఆడియోలో బాగా హైలైట్ అవుతున్న పాటల్లో ‘చారుశీలా.. స్వప్ప బాలా’ ఒక్కటి. దేవిశ్రీ ఎంటర్టైనింగ్ ట్యూన్ కి, రామజోగయ్య శాస్త్రి చమత్కారం కూడా తోడై ఈ పాట ఇన్ స్టంట్ గా జనాలకు ఎక్కేసింది. ఆడియోలో జనాలు బాగా హమ్ చేస్తున్న పాటల్లో ఇదొకటి. ఈ పాట తనకు కూడా ఫేవరెట్ అని.. ఆ పాట వల్లే తన హీరోయిన్ కు పేరు పెట్టే అవకాశం కూడా దొరికిందని అంటున్నాడు డైరెక్టర్ కొరటాల శివ.
‘శ్రీమంతుడు’లో హీరోయిన్ క్యారెక్టర్ కు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని.. ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని.. ఐతే ఆ క్యారెక్టర్ కు తాను ముందు ఏ పేరూ పెట్టలేదని.. అలాగే షూటింగ్ కూడా కానిచ్చేశానని.. ఏం పేరు పెడదామా అని చాన్నాళ్ల పాటు ఆలోచించిన తనకు దేవిశ్రీ ప్రసాద్ ఆన్సర్ ఇచ్చాడని చెప్పాడు కొరటాల. మ్యూజిక్ సిట్టింగ్స్ సందర్భంగా చారుశీలా పాట ట్యూన్ ఇచ్చాడని ,అప్పుడే హీరోయిన్ కు చారుశీలా అని పేరు పెట్టాలని డిసైడయ్యానని చెప్పాడు కొరటాల.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
