Delhi Crime3 Review: ఢిల్లీ క్రైమ్ 3 వెబ్ సిరీస్ రివ్యూ
on Nov 15, 2025
.webp)
వెబ్ సిరీస్ : ఢిల్లీ క్రైమ్ 3
నటీనటులు : హుమా ఖురేషీ, షెఫాలీ షా, రసిక దుగల్, అనురాగ్ అరోరా, రాజేశ్ తైలంగ్ తదితరులు
ఎడిటింగ్: పరీక్షిత్ జా
సినిమాటోగ్రఫీ: హితేష్ ములానీ, డేవిడ్ బోలెన్
మ్యూజిక్: బేవెర్లీ మిల్స్,
సైరీ టోర్జెసన్
నిర్మాతలు: ఆరోన్ కల్పన్, జెఫ్ సగన్స్కై, అపూర్వ బక్షి
దర్శకత్వం: తనూజ్ చోప్రా
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్
క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లకి ఉండే క్రేజే వేరు. అందుకే దర్శక నిర్మాతలు వీటిని కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఢిల్లీ క్రైమ్ ఆ కోవాలోకి చెందిందే. మరి ఈ సిరీస్ కథేంటో ఓసారి చూసేద్దాం.
కథ:
హర్యానాను అడ్డాగా చేసుకుని 'పెద్దక్క' పేరుతో మీనా (హ్యూమా ఖురేషి) తన అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటుంది. విజయ్ - కుసుమ ఆమె అనుచరులుగా ఉంటారు. ఢిల్లీలో మీనా మనిషిగా కల్యాణి పనిచేస్తూ ఉంటుంది. కల్యాణి ప్రధానమైన అనుచరుడిగా రాహుల్ ఉంటాడు. బలమైన కుటుంబ నేపథ్యంలేని అమ్మాయిలను టార్గెట్ చేసి, ఉద్యోగాలు ఇప్పిస్తామని వాళ్లను నమ్మంచి ఇతర రాష్ట్రాలకు .. ఇతర దేశాలకు తరలిస్తూ ఉంటారు. మిజోరామ్ మీదుగా ఆయుధాలు అక్రమ రవాణా జరుగుతుందని అనుమానించిన డీసీపీ వర్తిక చతుర్వేది (షెఫాలి షా)కి ఒక కంటెయినర్ లో కొంతమంది అమ్మాయిలు పట్టుబడతారు. దాంతో అక్కడి నుంచి ఆమె ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. అమ్మాయిలను ఎలా ఉచ్చులోకి లాగుతున్నారు.. ఢిల్లీలో ఎక్కడికి తరలిస్తున్నారు.. ఫైనల్ గా ఈ అమ్మాయిలందరూ ఎక్కడికి చేరుతున్నారనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఈ సిరీస్ మొత్తంగా ఆరు ఎపిసోడ్ ల స్ట్రీమింగ్ అవుతోంది. ఒక్కో ఎపిసోడ్ నలభై నుండి యాభై నిమిషాల నిడివి ఉంటుంది. కథా పాయింట్ పాతదే.. అయితే దానిని ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఏ దర్శకుడు చేస్తాడో అతను సక్సెస్ అవుతాడు. అందులో దర్శకుడు తనూజ్ చోప్రా సక్సెస్ అయ్యాడు. అక్రమ మార్గాల ద్వారా సంపాదించాలనుకునేవారికి క్లైమాక్స్ మెప్పిస్తుంది.
అక్రమంగా ఆయుధాల రవాణ లాగా అమ్మాయిలని ట్రాప్ చేసి వారిని ఇతర రాష్ట్రాలకి పంపించడం.. వారిని పోలీసులు పట్టుకోవడం ఇది కామన్. కానీ దీనిని దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. ఒక్కో ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. ఎపిసోడ్ ఎపిసోడ్ కి కథలో వేగం పెరుగుతుంది. బెస్ట్ స్క్రీన్ ప్లేతో కథా ఎంగేజింగ్ గా సాగుతోంది. ఎక్కడా కూడా సాగదీసినట్టుగా అనిపించదు. అశ్లీల పదాలు వాడలేదు. అసభ్యంగా ఎక్కడా అనిపించదు.
నేరస్థుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి.. వాళ్లు తమ అవసరాలను బట్టి ఎలా రంగులు మారుస్తూ ఉంటారు.. అమాయకుల జీవితాలతో ఎలాంటి విలాసాలను పొందుతుంటారనేది దర్శకుడు చూపించిన విధానం ఆసక్తిని పెంచుతుంది. ఎక్కడా కూడా ల్యాగ్ లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. అయితే ప్రతీ పాయింట్ ని వివరించాలనే పంథాలో నిడివి పెరిగిపోయింది. అది కాస్త తగ్గించి ఉంటే బాగుండేది.
నటీనటుల పనితీరు:
మీనాగా హుమా ఖురేషి, డీసీపీ వర్తిక చతుర్వేదిగా షెఫాలి షా సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచారు. మిగతావారంతా తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా : ఎంగేజింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఫీస్ట్ 'ఢిల్లీ క్రైమ్ 3'.
రేటింగ్: 2.75/ 5
✍️. దాసరి మల్లేశ్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



