ప్రముఖ బిజినెస్ మాన్ పై దీపికా పదుకునే ఘాటు ట్వీట్..అసలు నిజం చెప్పిందా!
on Jan 10, 2025
బాలీవుడ్ భామ దీపికా పదుకునే(Deepika padukone)కి భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది.షారుఖ్ ఖాన్(Sharukh Khan)హీరోగా 2007 లో విడుదలైన 'ఓం శాంతి ఓం' తో ప్రారంభమయిన ఆమె సినీ ప్రస్థానం దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి అప్రహాతీతంగా కొనసాగుతుంది. బాలీవుడ్ లో ఉన్న అందరి అగ్ర హీరోల సరసన నటించిన దీపికా గత సంవత్సరం జూన్ లో ప్రభాస్ తో కలిసి కల్కి 2898 ఏడి లో నటించి మంచి విజయాన్ని అందుకుంది.
ఇక రీసెంట్ గా ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్(sn subrahmanyan)తన సంస్థలో పనిచేసే ఉద్యోగులపై కొన్ని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు వాటిపై సోషల్ మీడియా వేదికగా దీపికా స్పందిస్తు 'ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రకటన చేయడం చాలా షాక్ గా ఉంది #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.సుబ్రమణియన్ కి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని దీపికా చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
సుబ్రమణియన్ తన దగ్గర పని చేసే ఉద్యోగుల గురించి మాట్లాడుతు వారానికి 90 గంటలు పని చెయ్యడంతో పాటు ఆదివారాల్లోను ఆఫీస్ కు రావాలి.ఎప్పుడూ ఇంట్లో ఉంటూ ఏం చేస్తారు,ఎంతసేపు భార్య ముఖం చూస్తు ఉంటారంటు వెటకారంగా మాట్లాడాడు. ఆయన తీరుపై నెటిజన్లు కూడా విరుచుకు పడుతున్నారు.
Also Read