దాసరితో మెగా హీరో ఢీ
on Oct 29, 2014
టైటిల్ చూసి ఏదోదో ఊహించుకోవొద్దు.. వీరిద్దరి సినిమాలూ ఒకేరోజు రాబోతున్నాయంతే. దాసరి దర్శకత్వం వహించిన ఎర్రబస్సు నవంబరు 14న విడుదల కాబోతోంది. అదే రోజున మెగా హీరో సాయిధరమ్‌తేజ్ సినిమా కూడా వచ్చేస్తోంది. సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా నటించిన చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవంబరు 14నే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అల్లు అరవింద్, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ స్వరాలు అందించారు. జగపతిబాబు కీలక పాత్రధారి. సాయి రెండో సినిమా విడుదల కూడా అయిపోతుంటే.. తొలి సినిమా రేయ్ బిక్కు బిక్కుమంటూ ల్యాబుల్లోనే మగ్గుతోంది. మరి ఆ సినిమాకి మోక్షం ఎప్పుడో...??