డాకు మహారాజ్ మూవీ రివ్యూ
on Jan 12, 2025
సినిమా పేరు:డాకు మహారాజ్
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు
సంగీతం: తమన్
డీఓపీ: విజయ్ కార్తీక్
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా
ఎడిటింగ్: నిరంజన్ దేవరమానే, రూబెన్
డైరెక్టర్:బాబీ కొల్లి
నిర్మాతలు:సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
విడుదల తేదీ: జనవరి 12, 2025
అఖండ,వీరసింహారెడ్డి,భగవంత్ కేసరితో హ్యాట్రిక్ విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి లయన్,గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)ఈ రోజు 'డాకు మహారాజ్'(Daku maharaj)గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.సంక్రాంతికి హిట్ ని అందుకునే హీరోగా బాలయ్యకి కొన్ని దశాబ్దాల నుంచి అభిమానుల్లో,ప్రేక్షకుల్లో పేరు ఉంది.ఈ నేపథ్యంలో మళ్ళీ సంక్రాంతికి 'డాకు మహారాజ్ తో వచ్చి హిట్ ని అందుకున్నాడా లేదో చూద్దాం.
కథ
సివిల్ ఇంజినీర్ సీతారామ్(బాలకృష్ణ) మధ్య ప్రదేశ్ లో పని చేస్తు తన భార్య(ప్రగ్య జైస్వాల్) తో నివాసం ఉంటూ ఉంటాడు.ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో పరమ క్రూరుడైన స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు (రవి కిషన్) లీజుకి తీసుకున్న కాఫీ ఎస్టేట్ లో కొకైన్ లాంటిది పండిస్తుంటాడు.అందుకు అడ్డొచ్చిన వాళ్లని చంపుతూ ఉంటాడు.ఈ క్రమంలోనే కాఫీ ఎస్టేట్ యజమాని కృష్ణమూర్తి(సచిన్ ఖేడ్కర్) మనవరాలైన వైష్ణవి ని చంపాలని అనుకుంటాడు.వైష్ణవి ని కాపాడటానికి నానాజీ(బాలకృష్ణ) వస్తాడు.మరో పక్క మధ్య ప్రదేశ్ చంబల్ ప్రాంతంలోని పేద ప్రజలు గుక్కెడు నీటికోసం బల్వంత్ ఠాకూర్ (బాబీ డియోల్) కి చెందిన ఒక గ్రానైట్ కంపెనీ లో బానిసలుగా పని చేస్తుంటారు.కలెక్టర్ గా పని చేస్తున్న ఠాకూర్ భార్య నందిని (శ్రద్ధా శ్రీనాథ్) ఆ పేదవాళ్ల బాధ తీర్చడానికి ఒక నిర్ణయం తీసుకుంటుంది.మరో పక్క స్పెషల్ ఆఫీసర్ స్టీఫెన్ రాజ్ (షైన్ టామ్ చాకో) డాకు మహారాజ్ అనే బందిపోటుని పట్టుకొని జైల్లో వెయ్యాలని చూస్తుంటాడు.అతను ఎందుకు డాకు మహారాజ్ ని పట్టుకోవాలని అనుకుంటున్నాడు? నందిని తీసుకున్న నిర్ణయం ఏంటి? సివిల్ ఇంజనీర్ సీతారాం అసలు ఎవరు ? నానాజీ ఎవరు? వైష్ణవి ని కాపాడటానికి ఎందుకు వచ్చాడు? అసలు డాకు మహారాజ్ ఎవరు? అతని లక్ష్యం ఏంటి?అనేదే ఈ కథ
ఎనాలసిస్
కథ పాతదే అయినా కూడా కథనం మాత్రం చాలా కొత్తగా ఉండటంవలన డాకు మహారాజ్ బాలయ్య అభిమానులకి, ప్రేక్షకులని నచ్చే అవకాశాలు ఉన్నాయి.ఫస్ట్ ఆఫ్ చూసుకుంటే బాలయ్య ఇంట్రడక్షన్ తో పాటు పాప వైష్ణవి తో వచ్చే సీన్స్ అన్ని కూడా చాలా కొత్తగా ప్రెష్ గా ఉన్నాయి.బాలయ్య ఒక పర్పస్ కోసం అక్కడకి వచ్చాడని ప్రేక్షకులకి తెలుస్తున్నా కూడా ఎందుకు వచ్చాడనే క్యూరియాసిటీ ని కలిగించడంలో మూవీ టీం సక్సెస్ అయిందని చెప్పవచ్చు.ఎం ఎల్ ఏ త్రిమూర్తులుతో, వాళ్ళ మనుషులతో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య మరోసారి వీరవిహారం చేసాడు.పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన ఊర్వశి రౌతేలా తో పాటు,దబిడి దబిడి సాంగ్ ప్లేస్ మెంట్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సూపర్ గా ఉండి సెకండ్ ఆఫ్ పై క్యూరియాసిటీ ని కలుగచేసింది.ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ దాకా చాలా ఇంట్రెస్ట్ గా సాగింది. పేద వాళ్ళ పట్ల బాలయ్య చూపించే అభిమానం,ఆ తర్వాత వాళ్ళ కోసం ఎంత గొప్ప వాళ్ళని అయినా ఎదిరించడం లో బాలయ్య మరోసారి విజృంభించాడు.కలెక్టర్ గా శ్రద్ద శ్రీనాద్ లక్ష్యం కూడా ప్రేక్షకులకి థ్రిల్లింగ్ ని కలుగచేస్తుంది.విలన్ గా బాబీ డియోల్ క్రూరత్వం,వాళ్ళు చేసే దుర్మార్గాన్ని డాకు మహారాజ్ గా బాలయ్య నామరూపాలు లేకుండా చేయడం వంటివి థియేటర్స్ లో పూనకాలు తెప్పిస్తాయి.బాలయ్య ఎలివేషన్స్ సీన్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. వార్నింగ్ చంపే వాడు ఇవ్వాలి.చచ్చే వాడు ఇవ్వకూడదనే బాలయ్య డైలాగ్ అయితే అన్ని చోట్ల పేలింది.క్లైమాక్స్ కూడా చాలా డిఫరెంట్ గా సెట్ చేసారు. టోటల్ గా మూవీ లో ఒక సరికొత్త బాలయ్య కనపడతాడు. బాలయ్య ఫ్యాన్స్ కి,మాస్ ఆడియెన్స్ కి 'డాకు మహారాజ్' పండగ అని చెప్పవచ్చు
నటినటులు,సాంకేతిక నిపుణుల పని తీరు
బాలయ్య నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.తన ఎనర్జీ లో ఎలాంటి మార్పు ఉండదని,మరోసారి డాకు మహారాజ్ ద్వారా నిరూపించాడు.మూడు విభిన్నమైన షేడ్స్ లలో అవలీలగా నటించి తన అభిమానుల్లో నిజమైన సంక్రాంతిని నింపాడు.పాప తో వచ్చే సెంటిమెన్స్ సీన్స్ గాని,యాక్షన్ సన్నివేశాల్లోగాని అద్భుతంగా నటించాడు.ముఖ్యంగా తన ట్రేడ్ మార్క్ డైలాగుల్లో మరోసారి జూలు విదిలించడమే కాకుండా మూవీ మొత్తాన్ని తన భుజస్కందాలపై మోసుకొని విజయాన్ని అందుకున్నాడు.ఇక ప్రగ్య జైస్వాల్,శ్రద్దశ్రీనాద్ లు కూడా తమ కెరిరీలోనే ఉత్తమమైన ప్రతిభని కనపర్చారు.ముఖ్యంగా శ్రద్ద శ్రీనాధ్ అయితే ఒక రేంజ్ పెర్ఫార్మ్ ని ప్రదర్శించింది.తన కెరిరీలోనే బెస్ట్ మూవీ గా కూడా డాకు మహారాజ్ నిలబడుతుందని చెప్పవచ్చు.బాబీ డియోల్ కూడా విలన్ క్యారక్టర్ లో అదరహో అనిపించాడు.మిగతా పాత్రల్లో చేసిన వాళ్ళు కూడా తమ పరిధి మేరకు చక్కగా నటించారు.ఇక దర్శకుడు బాబీ విషయానికి వస్తే ఈ సినిమాతో మరో లెవల్ కి వెళ్లాడని చెప్పుకోవచ్చు.ఎంచుకున్న కథ గాని,దానికి తగ్గ స్క్రీన్ ప్లే ని సమకూర్చుకోవడంలో నూటికి నూరుపాళ్ళు సక్సెస్ ఆయాడు.ఆర్ట్ డిపార్ట్మెంట్ పని తనాన్ని కూడా మెచ్చుకొని తీరాల్సిదే.ఇక థమన్ సంగీతంలో వచ్చిన సాంగ్స్ నిరుత్సాహ పరిచినా కూడా బిజిఎం అయితే నభూతో న భవిష్యతి.బాలయ్య గుర్రం మీద వస్తు, శత్రువుల మీద దాడి చేస్తున్నపుడు తమన్ ఇచ్చిన ఎలివేషన్ థియేటర్స్ లో ప్రేక్షకుల చేత పూనకాలు తెప్పిస్తుంది.సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి.
టోటల్ గా చెప్పాలంటే.... 'డాకు మహారాజ్' బాలయ్య అభిమానులకి, మాస్ అభిమానులకి నచ్చే అవకాశాలు ఎక్కువ.కాకపోతే సెకండ్ ఆఫ్ ఇంకొంచం బాగుండాల్సింది.
రేటింగ్ 3 /5 అరుణా చలం
Also Read