డాకు మహారాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే
on Jan 13, 2025
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna) నిన్న సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్'(Daku Maharaj) తో థియేటర్స్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలైన అన్ని చోట్ల కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడంతో పాటు సంక్రాంతి విన్నర్ బాలయ్య అనే టాక్ కూడా అభిమానులు,ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది.
ఇక ఈ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్ల 31 లక్షలని సాధించింది.ఏరియా వారీగా చూసుకుంటే నైజాంలో తొలి రోజు 4 కోట్ల 7 లక్షలు, సీడెడ్ లో 5 కోట్ల ఇరవై ఐదు లక్షలు,
గుంటూరు 4 కోట్లు, కృష్ణా 1 కోటి ఎనభై ఆరు లక్షలు,ఈస్ట్ గోదావరి 1 కోటి తొంబై ఐదు లక్షలు, వెస్ట్ గోదావరి 1 కోటి డెబ్భై ఐదు లక్షలు,నెల్లూరు 1 కోటి యాభై ఒక్క లక్షలు, UA లో 1 కోటి తొంబై రెండు లక్షలు ఇలా టోటల్ గా తొలి రోజు 22 కోట్ల 31 లక్షలతో సన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది.మరి మూవీకి పాజిటివ్ టాక్ ఉన్న దృష్ట్యా ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.దీంతో బాలయ్య మరోసారి సరికొత్త రికార్డులు సృష్టించడం పక్కా అని బాలయ్య అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు వారు వ్యక్తం చేస్తున్నారు.
బాబీ(Bobby) దర్శకత్వంలో తెరకెక్కిన 'డాకు మహారాజ్' ని సితార ఎంటర్ టైన్ మెంట్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా ప్రగ్య జైస్వాల్, శ్రద్ద శ్రీనాధ్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి,బాబీడియోల్ కీలక పాత్రలు పోషించారు.ఇక బాలయ్య పవర్ ఫుల్ నటనకి థమన్ ఇచ్చిన బిజీఎం అయితే ఒక రేంజ్ లో ఉంది.మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తున్నారు.టెక్నీకల్ గా కూడా ఎంతో హై లెవల్లో ఉండటంతో పాటు ఒక సరికొత్త బాలయ్య 'డాకు మహారాజ్' ద్వారా కనిపించాడనే మాటలు కూడా ప్రేక్షకుల నుంచి వ్యక్తం అవుతుంది . .
Also Read