తెలుగు సినిమాలో విలన్ గా స్టార్ క్రికెటర్
on Mar 14, 2024
ఇండియాలో రెండిటికి ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఒకటి సినిమా,రెండోది క్రికెట్. సినిమా వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ గా మారడం లేదు గాని క్రికెట్ వాళ్ళు మాత్రం సినిమా నటులుగా మారుతున్నారు. అలా క్రికెటర్ నుంచి నటుడుగా మారిన వాళ్ళల్లో శ్రీశాంత్ కూడా ఒకడు. తాజాగా ఆయనకి సంబంధించిన ఒక న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
యమధీర అనే సినిమాలో శ్రీశాంత్ విలన్ గా చేస్తున్నాడు. దేశ్ ముఖ్ అనే ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ లో తన సత్తా చాటబోతున్నాడు. దీంతో తెలుగు నాట యమధీర మూవీ ప్రాధాన్యతని సంతరించుకుంది. కన్నడ హీరో కోమల్ హీరోగా చేస్తున్నాడు.నాగబాబు, అలీ, సత్య ప్రకాష్ లు ముఖ్య పాత్రల్లో నటించారు.తాజాగా ప్రముఖ నిర్మాత అశోక కుమార్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ అయ్యింది. మార్చి 23 న మూవీ రిలీజ్ అవుతుంది. శ్రీ మందిరం ప్రొడక్షన్స్ పతాకంపై వేదాల శ్రీనివాస్ నిర్మించాడు.
ఇక శ్రీకాంత్ గతంలో కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. కాకపోతే విలన్ క్యారక్టర్ లో తెలుగులో నటించడం మాత్రం ఇదే తొలిసారి. 2007 ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీశాంత్ చివరి ఓవర్ లో పట్టిన క్యాచ్ ని ఎవరు మర్చిపోలేరు. ఎంతో టెన్షన్ లో కూడా శ్రీశాంత్ ఆ క్యాచ్ పట్టడం వల్లనే మనకి కప్ వచ్చింది.అలాగే తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఫిక్సింగ్ ఆరోపణలని కూడా ఎదుర్కున్నాడు.