కోర్ట్ ఓటిటి డేట్ ఇదే
on Apr 7, 2025

ప్రియదర్శి(Priyadarsi)శివాజీ(Sivaji)హర్ష రోష్,శ్రీదేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం'కోర్ట్'(Court).మార్చి 14 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా,వసూళ్ల పరంగా కూడా అంచనాలకి మించి కలెక్షన్స్ ని రాబట్టింది.రామ్ నారాయణ(Ram Narayana)దర్శకత్వంలో ప్రముఖ హీరో నాచురల్ స్టార్ నాని(Nani)ప్రశాంతి తిప్పరనేని సంయుక్తంగా నిర్మించగా విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించాడు.
ఇప్పుడు ఈ మూవీ ఏప్రిల్ 11 న నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది.ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారకంగా ప్రకటించడంతో ఓటిటి మూవీ లవర్స్ లో సరికొత్త సినీ జోష్ వచ్చిందని చెప్పవచ్చు.ఫోక్సో చట్టంలో ఉన్న కొన్నిలోపాల వల్ల,ఏ తప్పు చెయ్యని అమాయకపు అబ్బాయిలు ఎలా బలవుతున్నారో 'కోర్ట్' లో చాలా చక్కగా చూపించారు.ప్రియదర్శి లాయర్ గా,హర్ష రోష్,శ్రీదేవిలు ప్రేమలో పడిన యువతీ యువకులుగా ఎంతో అత్యద్భుతంగా నటించారు.శివాజీ నటనకి అయితే ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు.
ఈ విధంగా మిగతా పాత్రల్లో నటించిన సాయికుమార్,హర్షవర్ధన్,రోహిణి,శుభలేఖ సుధాకర్ ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రల పరిధి మేరకు నటించి మూవీ విజయంలో బాగస్వామ్యమయ్యారు.బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 48 కోట్ల దాకా వసూలు చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



