‘హీరో’ టైటిల్ ఎవరికి సొంతమో..?
on Mar 13, 2019
తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా ఈరోజు సినిమా ప్రారంభమైంది. ఆ సినిమా టైటిల్ 'హీరో'. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు 'హీరో' టైటిల్ అనుకుంటున్నారు. అనుకోవడం ఏముంది ఆ మేరకు లీకులు కూడా ఇచ్చారు. అయితే.. అదే టైటిల్ తో తమిళంలో శివ కార్తికేయన్ సినిమా ప్రారంభించాడు. టైటిల్ రిజిస్ట్రేషన్ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో మరి?? ఈ టైటిల్ విషయంలో గొడవ తప్పేలా కనిపించడం లేదు. ఇటీవల తెలుగులో ముద్ర టైటిల్ విషయంలో హీరో నిఖిల్, నిర్మాత నట్టికుమార్ మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. చివరకు నిఖిల్ సినిమా టైటిల్ ను 'అర్జున్ సురవరం' గా మార్చారు. ఈ హీరో టైటిల్ ఎవరి సినిమాకు ఉంటుందో? ఎవరి సినిమాకు మారుతుందో? చూడాలి.