సినిమా హిట్ అయినా.. వసూళ్లే లేవు!
on Jul 3, 2016
24 సినిమా అటు విమర్శకుల ప్రశంసలనూ, ఇటు ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా. ఈ సినిమా విడుదలైన తొలి రోజే సూపర్ టాక్ బయటకు వచ్చేసింది. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా ఇరగదీయడం ఖాయమనుకొన్నారంతా. కానీ ఫైనల్ రిజల్ట్ చూసే సరికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. భారీ లాభాలు రాకపోగా.. కష్టాలు కనిపించాయి. 24 సినిమాకి దాదాపుగా 60 కోట్లకు పైగానే ఖర్చు పెట్టినట్టు టాక్. అయితే తెలుగు, తమిళ భాషలు కలుపుకొని.. 55 కోట్లే వచ్చాయట. తమిళంలో కంటే తెలుగులోనే ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏ సెంటర్ సినిమాపై ముద్ర పడడం.. బీసీల్లో ఈ సినిమా పెద్దగా ఎక్కకపోవడం వల్ల ఊహించిన వసూళ్లు రాలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హిట్ టాక్ వచ్చినా కాస్ట్ ఫెయిల్యూర్ వల్ల ఈ సినిమా నష్టపోయిందని అంటున్నారు. కాని సూర్య పారితోషికం మినహాయిస్తే ఈ సినిమాకు లాభాలు వచ్చినట్లే లెక్క. ఎందుకంటే ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే కదా..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
