మోహన్ బాబు పై చిరంజీవి కీలక వ్యాఖ్యలు.. మోహన్ బాబు వల్లే అది సాధ్యమైంది
on Nov 20, 2025

చిరంజీవి లేటెస్ట్ స్పీచ్ వైరల్
ఈ నెల 21 న ఫ్యాన్స్ హంగామా
రామ్ చరణ్ కి ఈ మూవీ అంటే చాలా ఇష్టం
కొదమ సింహం మళ్ళీ మెప్పిస్తుందా!
మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)స్టార్ డమ్ ని మరింతగా ఎలివేట్ చేసిన చిత్రం 'కొదమసింహం'(Kodama Simham). 1990 అగస్ట్ 9 న రిలీజవ్వగా చిరంజీవి నుంచి వచ్చిన మొట్టమొదటి కౌబాయ్ మూవీ. అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ(Krishna)నుంచి 'మోసగాళ్లకి మోసగాడు' వంటి కౌబోయ్ చిత్రం వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. పైగా కౌబోయ్ గా కృష్ణ అందరి హృదయాల్లో ఒక రూపంగా నిలిచిపోయారు.
దీంతో అభిమానులతో పాటు సినీ లవర్స్ లో 'కొదమసింహం'పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అందరి అంచనాలకి తగ్గట్టే మూవీ మంచి విజయాన్ని అందుకుంది. చిరంజీవి మేనరిజమ్స్, డాన్స్, సాంగ్స్, డైలాగ్స్ అభిమానులని ఉర్రుతలూగించాయి. సాంగ్స్ అయితే నేటికీ యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తూ ఉన్నాయి.
ఇక ఈ చిత్రం ఈ నెల 21 న మరోమారు సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టనుంది. దీంతో 35 ఏళ్ళ తర్వాత కొదమసింహాన్ని చూడటానికి అభిమానులు ప్రిపేర్ అవుతున్నారు. రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేసారు. సదరు వీడియోలో ఆయన మాట్లాడుతు కౌబాయ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కానీ అలాంటి చిత్రాల్లో నటిస్తానని ఎప్పుడు ఊహించలేదు. అప్పటికే కృష్ణ గారు చేసిన 'మోసగాళ్లకు మోసగాడు’ పెద్ద హిట్ అవ్వడంతో పాటు అప్పట్లో ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. అటువంటి నేపథ్యంతో కూడిన సినిమాని మళ్లీ చేయడం సాహసమే అవుతుంది. నిర్మాత, దర్శకుడి కోరిక ప్రకారమే చేశాను.
కౌబాయ్ సినిమాల్లో హీరోలు గడ్డం తీసేస్తారు. కానీ నేను గడ్డంతో కనపడతాను. ఆ విధంగా గడ్డం పెంచి నేను చేసిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. మోహన్ బాబు చేసిన సుడిగాలి క్యారక్టర్ నాకు చాలా ఇష్టం. వినోదంగా ఉంటూనే చాలా జుగుబ్సగా అనిపించే సదరు క్యారక్టర్ లో చాలా బాగా నటించారు. మోహన్ బాబు తప్ప మరొకరు ఆ పాత్ర చేసి మెప్పించి ఒప్పించేవారు కాదు. అది ఆయన వల్లే సాధ్యమైంది. లెజెండరీ యాక్టర్ ప్రాణ్ విలన్ గా చేశారు. ఆ మహానుభావుడితో కలిసి యాక్ట్ చేసే అదృష్టం నాకు కలిగింది.
also read: నా సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా.. ఏరియా ఇదే
రామ్ చరణ్(Ram Charan)కి ఈ మూవీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు వాడు భోజనం చేయాలంటే వాళ్లమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితే గానీ, భోజనం చేసేవాడు కాదు. చరణ్ కి అంతటి ఫేవరేట్ ఫిలిం. ఇప్పుడు రీ రిలీజ్ తో మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా అందరూ కొదమసింహని ఎంజాయ్ చేస్తారని చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరంజీవి సరసన సోనమ్, రాధ జంటగా నటించగా వాణి విశ్వనాధ్, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, రంగనాధ్, గొల్లపూడి మారుతీ రావు, జయంతి, అన్నపూర్ణ కీలక పాత్రలు పోషించారు. మురళి మోహన్ రావు(Murali MOhanrao)దర్శకుడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



