చిరు-పవన్ మల్టీస్టారర్: తెలుగు చరిత్రలోనే గొప్ప సినిమా
on May 29, 2017

కళాబంధు సుబ్బిరామిరెడ్డి గారు కొన్ని నెలల క్రితం మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక మల్టీస్టారర్ చేస్తానని అనౌన్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ జరుగుద్దో లేదో అనే సందేహాలు ఉండేవి. వాటికి సమాధానమిస్తూ, పవన్ ని త్రివిక్రమ్ ని ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా సెట్లో కలిసిన సుబ్బిరామి రెడ్డి, మీడియా తో మాట్లాడడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది... మెగా కంబినేషన్లో వస్తున్న సినిమా మొత్తానికి త్వరలో పట్టాలపైకి వెళ్లనుంది. ప్రస్తుతం, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వేరే ప్రాజెక్టులతో బిజీ గా ఉన్నారు.
వాళ్ళు, ఆ సినిమాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత, మెగా మల్టీస్టారర్ భారీ గా లాంచ్ చేయడం జరుగుతుంది. స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. ఇది తెలుగు చరిత్రలోనే గొప్ప సినిమాగా మిగిలిపోతుంది," అని సుబ్బిరామిరెడ్డి గారు తెలపడం జరిగింది. పవన్ తో సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఒక పొలిటికల్ థ్రిల్లర్ తీయనున్నారు. తన తదుపరి చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి చేయనున్న చిరంజీవి, బోయపాటి శ్రీను తో ఒక సినిమా కమిట్ అయ్యాడు. సో, మెగా మల్టీస్టారర్ మొదలవ్వడానికి టైం బాగానే పట్టొచ్చు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



