అది నోరా? తాటి మట్టా?
on Nov 11, 2017
జీఎస్టీ.. నోట్ల మార్పిడి... అని రకరకాల ప్రయోగాలు చేస్తూ.. రాజావారు జనాలను ఓ రేంజ్ లో హింసపెడుతుంటే.. అది చాలదన్నట్టు... ఆయన బంటులేమో.. వీధి కుక్కల్లా శబ్ద కాలుష్యం చేస్తూ జనాన్ని మరో రకంగా హింసకి గురి చేస్తున్నారు.
దేశంలో వేరే సమస్యలేం లేనట్టు.. సినిమా వాళ్లపై ఏంటంట వీరి ప్రతాపం? తెరమీద బొమ్మ నుంచి ఎలాగూ వాక్ స్వాతంత్ర్యాన్ని లాక్కున్నారు. కనీసం సినిమాలు తీసే కుటుంబాలకు కూడా గౌరవం ఇవ్వరా?
ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనపై డైరెక్ట్ గా సినిమాలు తీశారు. వెండితెర వేల్పుగా ప్రజలతో నీరాజనాలందుకున్న మహానటుడ్ని... అదే వెండితెర సాక్షిగా గేలి చేశారు. ఎగతాళి చేశారు. విమర్శించారు... తిట్టారు.. ఆయన పాత్ర వేరొకరితో వేయించి రాళ్లతో కొట్టించారు. కానీ.. ప్రభుత్వం తనదే అయినా.. ఏనాడూ ఒక్క సినిమాకు కూడా అడ్డు చెప్పలేదాయన. ‘ఇది ప్రజాస్వామ్యం. విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది‘ అని యధేశ్చగా సినిమాలను విడుదల చేసుకోడానికి అనుమతులు కూడా ఇచ్చాడు. రాజ్యాంగానికి ఆయనిచ్చిన గౌరవం అది.
కానీ నేడు.. ఓ సినిమాలో కేవలం ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ నాలుగు డైలాగులు రాస్తే.. వాటిని మ్యూట్ చేశారు. తమిళనాడులో అయితే ఆ సినిమా ఆపేయడానికి కూడా తెగబడ్డారు. తెలుగులో ఆ సినిమా విడుదలవ్వడానికి పాపం.. ప్రసవవేదనే పడింది. తీరా వచ్చాక అందులో డైలాగులు లేవ్. దీన్ని ప్రజాస్వామ్యం అనాలా? రాచరికం అనాలా?
సినిమా వాళ్ల పెళ్లాలు.. రోజుకొక మొగుడ్ని మారుస్తారట! దుష్ట మనస్తత్వాలతో తనను చికాకు పెట్టే దర్శకులను చెప్పుతో కొడతాడట! బీజేపీ ఎంపీ చింతామణి మాలవీయ చేసిన వ్యాఖ్యలివి. దీన్ని కుక్కవాగుడు అనాలా? ఏమనాలి? ఎవరిపై కోపం వస్తే వాళ్లను తిట్టాలి. అంతేకానీ.. ఇళ్లలో ఆడోళ్లేం చేశారు? చెప్పులు ఈయనగారికేనా ఉన్నాయా? దేవుడి దయవల్ల చాలామందికి ఉన్నాయ్. పాపం.. మాలవీయ గారివి ఖరీదైన చెప్పులు. తేలిగ్గా ఉంటాయ్. దెబ్బ తక్కువ. దేశంలో ఖరీదైన చెప్పులు అందరూ వాడలేరు కదా. అందుకే ఎక్కువమంది చెప్పులు బరువెక్కువగా ఉంటాయ్. పొరపాటు అందరూ తలా చెప్పు చేసుకుంటే.. మాలవీయ గారు ఏమైపోతారో?
సినిమాల్లో ప్రభుత్వ పోకడలను విమర్శించకూడదు. అలా చేస్తే డైలాగుల్ని మ్యూట్ చేస్తారు. మరి సినిమా వాళ్ప పెళ్లాలను సాక్షాత్ ప్రభుత్వ పెద్దలే ఎంతమాట పడితే అంతమాట అంటుంటే.. వింటూ ఊరుకోవాలి. ఇదికెక్కడి న్యాయం?
మహిళలకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చే విలువ ఇదన్నమాట. భారతదేశంలోని మహిళల్లో సినిమా వాళ్ల పెళ్లాలు లేరా? వాళ్లు కూడా ఓటర్లే! మీరు తల్చుకుంటే కేవలం తెరపై డైలాగుల్ని మాత్రమే మ్యూట్ చేయిస్తారు. కానీ.. ఓటర్లు తల్చుకుంటే... రాజకీయ ముఖచిత్రంలోనే మీరు డిలిట్ అయిపోతారు
కొసమెరుపు:-
అయ్యా... చింతామణి మాలవీయ గారూ... నోటితో మాట్లాడాలండి. కంపు కొట్టే చండాలాన్ని బయటకు పంపడానికి దేవుడు వేరే దారి ఇచ్చాడు. అర్థమైందా?