సుహాసిని తండ్రి పరిస్థితి విషమం
on Nov 1, 2024

దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలోని అన్ని భాషలకి సంబంధించిన సినిమాల్లో విభిన్నమైన పాత్రలని పోషించిన నటుడు చారు హాసన్(charuhasan)తాజాగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పటల్ కి తరలించారు. ఈ విషయాన్నీ ఆయన కుమార్తె మాజీ హీరోయిన్ అయినటువంటి సుహాసిని(suhasini)సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడి చేసింది.
దీపావళి కి ముందు మా నాన్న అస్వస్థతకి గురవ్వడంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళాం.దాంతో మా పండుగ ఎమర్జెన్సీ వార్డ్ లో గడిచిపోయింది. ప్రస్తుతానికి సర్జరీ కి ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ సుహాసిని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.తొంబై రెండు సంవత్సరాల వయసు గల చారుహాసన్ గతంలో కూడా ఒకసారి అస్వస్థతకి గురవ్వడంతో మెరుగైన ట్రీట్మెంట్ తీసుకొని డిచ్ఛార్జ్ అయ్యాడు.

దళపతి, నేటి సిద్దార్ధ, సూర్య ఐపీఎస్, శాంతి క్రాంతి, నిర్ణయం, అంకురం, మాతృ దేవో భవ, జమదగ్ని, వెంకిమామ, శుభోదయం, ఇన్ స్పెక్టర్ రుద్ర, మౌనం వంటి పలు తెలుగు చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలని పోషించాడు.ప్రముఖ అగ్ర హీరో కమలహాసన్(kamal haasan)కి చారుహాసన్ స్వయానా అన్నయ్య అవుతారనే విషయం అందరకి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



