ఛార్మిని నిలువునా ముంచేశారు
on Jul 7, 2015
జ్యోతిలక్ష్మితో ఛార్మి కెరీర్ జెట్ వేగంతో దూసుకుపోతుందనుకొన్నారంతా! ఆ సినిమాతో ఛార్మి వెలుగులు మళ్లీ మొదలవుతాయని భావించారంతా! నటిగానే కాదు, నిర్మాతగానూ ఆ సినిమా ఛార్మికి చాలా కీలకమైంది. ఏమాత్రం పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా చేజిక్కించుకొని ఆ రూపేణా రూ.5 కోట్ల వరకూ తన ఖాతాలో వేసుకొందామనుకొంది. అయితే ఈ లెక్కలన్నీ నీటిమీద రాతలయ్యాయి. సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు సి.కల్యాణ్ చేతులెత్తేసినట్టు టాక్. ఛార్మికి వాటా కాదుకదా... పారితోషికం రూపేణా ఒక్క రూపాయి కూడా ముట్టలేదట.
వాటా అంటూ ఆశలకు పోకుండా పారితోషికం అందుకొన్నా...కనీసం రూ.50 లక్షలైనా వచ్చేవి. రూ.5 కోట్లపై ఆశలతో ఈ రూ.50 లక్షల్ని పణంగా పెట్టింది. ఇప్పుడు ఆ రెండూపోయాయని ఉసూరుమంటోంది ఛార్మి. మరోవైపు జ్యోతిలక్ష్మి తరవాత పూరితో డీలింగ్స్ కూడా పోయాయని టాక్. ఇది వరకు ఎక్కువగా పూరి ఆఫీసులోనే గడిపే.. ఛార్మి ఇప్పుడు తట్టా బుట్టా సర్దేసుకొని అక్కడి నుంచి జంప్ అయిపోయిందట. పూరి కూడా ఛార్మితో టచ్‌లో లేకుండా పోయాడని టాక్. మొత్తానికి జ్యోతిలక్ష్మి ఛార్మి కెరీర్‌కి హైప్ తెస్తుందని భావిస్తే... ఆ సినిమాతో నిలువుగా మునిగిపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
