ఐఫాలో చార్మీని ఓదార్చిన శ్రియ
on Jan 27, 2016
రీసెంట్ గా ముగిసిన ఐఫా ఈవెంట్ లో ఛార్మీ కంటనీరు పెట్టుకుంది.. పక్కనే ఉన్న శ్రియ, ఛార్మిని ఓదార్చింది. ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో చక్కర్లు కొడుతోంది. ఐఫాలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఛార్మిని ఎమోషనల్ చేసేసిందని, దాంతో ఆపుకోలేక కంటతడి పెట్టిందని సమాచారం.ఎప్పుడూ చాలా చలాకీగా,ధైర్యంగా కనిపించే ఛార్మి అలా ఏడవడం అక్కడున్న వారిని కదిలించింది.
అందం, అభినయం రెండూ ఉన్న చార్మి,కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. ఎన్ని సినిమాలు చేసినా, ఇప్పటి వరకూ ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. సినిమాల్లో అవకాశాలు తక్కువై, అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ లో మాత్రమే మెరుస్తున్న ఛార్మి, ఒక్క బ్రేక్ వస్తే,తిరిగి ఫామ్ లోకి రావచ్చని ఆశలు పెట్టుకుంది. మరి ఆమె ఆశలు ఎప్పుడు ఫలిస్తాయో చూడాలి